తెలంగాణ‌లో మ‌రో ఉప ఎన్నిక?

Update: 2016-10-18 11:29 GMT
ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ తో ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌కు గులాబీ కండువా క‌ప్పిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు ఆ రాజ‌కీయ క్రీడ తాలుకు ఫ‌లితం క‌నిపిస్తున్న‌ట్లుందనే చ‌ర్చ సాగుతోంది. ప్ర‌తిప‌క్ష పార్టీ త‌ర‌ఫున గెలిచిన టీఆర్ ఎస్‌ లో చేరిన ఎమ్మెల్యే పువ్వాడ అజ‌య్ చేసిన కామెంట్లు ఇందుకు నిద‌ర్శ‌నంగా ఉన్నాయి. భూ వివాదంలో కోర్టు తీర్పును ఉద్దేశిస్తూ రాజ‌కీయ దురుద్దేశం అని పేర్కొన‌డంతో పాటుగా అవ‌స‌ర‌మైతే రాజీనామా చేస్తాన‌ని అజ‌య్ ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఖమ్మం జిల్లాలో పువ్వాడ‌ అజ‌య్‌ కు చెందిన కాలేజీ స‌మీపంలో ఉన్న ప్ర‌భుత్వ స‌రస్సును ఆక్ర‌మించుకొని ఆయ‌న విద్యా సంస్థ‌ నిర్మాణం చేప‌ట్ట‌గా...ఆ భూమిని ప్రభుత్వం క్రమబద్దీకరించిందని అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ సుధాకర్‌ రావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై స్పందించిన కోర్టు  2.5 ఎకరాల భూమిలో చేపట్టిన వైద్య కళాశాల నిర్మాణాన్ని ఆపాలని - మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ ప‌రిణామంపై అజ‌య్ మాట్లాడుతూ  రాజకీయంగా ఎదుర్కోలేక కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 2.10 కోట్లు చెల్లించి మమతా కాలేజీ పక్కన స్థలాన్ని జీవో 59 ప్రకారం క్రమబద్దీకరించుకున్నామని తెలిపారు. తమ కాలేజీ ఆవరణలో ఎలాంటి సరస్సులు లేవని స్పష్టం చేశారు. పార్టీ మార‌డం - త‌న‌పై వ‌చ్చిన తాజా ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశిస్తే రాజీనామాకు సిద్దమ‌ని ఎమ్మెల్యే అజయ్ ప్ర‌క‌టించారు.  పువ్వాడ అజ‌య్ క‌మ్యూనిస్టు పార్టీ సీనియ‌ర్ నేత పువ్వాడ నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడు అనే సంగ‌తి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News