పువ్వాడకు కెకెకె కోటాలో మంత్రి పదవి వచ్చిందా?

Update: 2019-09-10 05:33 GMT
ఇద్దరు నేతలు కలిస్తే వారి మధ్య సాగే సంభాషణ రోటీన్ కు భిన్నంగా ఉంటుంది. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కొత్తగా మంత్రి పదవిని సొంతం చేసుకున్న పువ్వాడ అజయ్ కుమార్.. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ లు ఎదురుపడ్డారు. ఆ వెంటనే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా సాగితే.. తాను మాత్రం తక్కువ తినలేదన్నట్లు పువ్వాడ కూడా పంచ్ లు వేయటం విశేషం.

మొత్తంగా ఇరువురి నేతల మధ్య సాగిన సంభాషణ సరదాగానే సాగి.. అందరిని నవ్వుల్లో ముంచెత్తింది. పువ్వాడతో మాట్లాడుతూ.. మొత్తానికి కేటీఆర్ చెవులు కొరికి మంత్రి పదవి కొట్టుకుపోయావ్ అని బాల్క సుమన్ సరదాగా వ్యాఖ్యానిస్తే.. దానికి నవ్వుతూ బదులిస్తూ పువ్వాడ కూడా ధీటుగానే రియాక్ట్ అయ్యారు.

మీరే స్టార్స్ .. మమ్మల్ని రానిస్తారా? అడ్డంగా మీరే నిలబడతారుగా?  24 గంటలూ కేటీఆర్ దగ్గరేఉంటారు.. అక్కడే ఉండీ ఉండీనువ్వూ ఓ పదవి కొట్టేశావ్ అని పువ్వాడ బదులిచ్చారు. అంతే కాదు.. తనకు కెకెకె కోటాలో మంత్రి పదవి వచ్చిందన్నారు. ఇంతకీ కేకేకే కోటా ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం. ఖమ్మం.. కమ్మ.. కేటీఆర్ అంటూ ట్రిపుల్ కే అంటూ వివరం చెప్పేశారు.

తన తండ్రి కాలం నుంచి ఎంతో కష్టపడితే.. ఇన్నాళ్లకు మంత్రిపదవి వచ్చిందని.. నీ కళ్లు నా మీద పడనివ్వకు.. ఒక చేతకానిని తీసుకొచ్చి వివేక్ వెంకటస్వామి పదవి కోయించేశావ్ అంటూ నవ్వుతూనే పంచ్ వేశారు. దీనికి బాల్క బదులిస్తూ.. నువ్వేమన్నా తక్కువనా? ఒక రైజింగ్ స్టార్ (పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి).. ఒక సీనియర్ స్టార్ (తుమ్మల నాగేశ్వర్ రావు) ను కోయలేదా? అని రియాక్ట్ అయ్యారు. మొత్తానికి వీరిద్దరి సంభాషణ అక్కడి వారిని నవ్వులు పూయించేలా చేయటమే కాదు.. ఇద్దరిలో ఎవరూ అస్సలు తగ్గలేదుగా?
Tags:    

Similar News