ఇంగ్లాండ్ పర్యటనకు వెళుతున్న భారత ఆటగాళ్లకు భారీ ఊరట దక్కింది. క్వారంటైన్ సమయాన్ని 10 రోజుల నుంచి మూడు రోజులకు కుదించేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఒప్పుకున్నది. భారత పురుష, మహిళా జట్లు ఇంగ్లండ్ కు వెళ్తున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్ తో వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ కు బయలుదేరనున్నది.ఇందుకోసం ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు.. వాళ్ల కుటుంబసభ్యులు కరోనా పరీక్షలు చేయించుకొని.. క్వారంటైన్ లో ఉన్నారు.
అయితే వీళ్లకు బ్రిటన్ క్రికెట్ బోర్డు సైతం క్వారంటైన్ విధించింది. ఇండియా నుంచి వచ్చాక కచ్చితంగా 10 రోజలు కఠిన క్వారంటైన్ లో ఉండాలని సూచించింది. దీంతో ప్రాక్టీస్ ఇబ్బంది అవుతుందని క్రీడాకారులు భావిస్తున్నారు. అంతేకాక ఇప్పటికే ఈ విషయంపై పలు మార్లు బీసీసీఐ సైతం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో మాట్లాడింది. దీంతో స్పందించిన ఇంగ్లండ్ బోర్డు 10 రోజుల క్వారంటైన్ ను మూడు రోజులకు కుదించింది. టీమిండియా క్రికెటర్లకు ఇది శుభవార్త అని బీసీసీఐ అంటున్నది. క్రికెటర్లకు ప్రాక్టీస్ చేసుకొనేందుకు అవకాశం ఉందని బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు.
ఇంగ్లాండ్ టూర్ కోసం పురుషుల, మహిళల టీంలు జూన్ 2న ఇంగ్లాండ్ కు వెళ్లనున్నాయి. అయితే ఈ పర్యట కోసం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తొలుత కఠినమైన ఆంక్షలు విధించింది. దీంతో బీసీసీఐ .. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు విజ్ఞప్తి చేసింది. క్వారంటైన్ నిబంధనలు సడలించాలని.. కేవలం మూడు రోజుల పాటే క్వారంటైన్ ఉండాలే చూడాలని కోరింది. దీనికి స్పందించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నది. ఆటగాళ్ల కుటుంబ సభ్యుల క్వారంటైన్ విషయంలోనే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.