తెలంగాణకు ఎవరైనా వస్తుంటేనే కవితకు క్వశ్చన్లు గుర్తుకొస్తాయా?

Update: 2022-05-14 09:33 GMT
ప్రజా సమస్యల మీద ప్రజాప్రతినిధుల పోరాటం నిరంతరం చేస్తూనే ఉండాలి. అంతే తప్పించి ప్రజా సమస్యల్ని.. రాష్ట్ర సమస్యల్ని రాజకీయ కోణంలో కాకుండా.. సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేయాలి.

ఎవరి మీద ఒత్తిడి తెస్తే పనులు పూర్తి అవుతాయో వారి మీద ఆ ప్రెజర్ వేయాలి. అంతే తప్పించి.. ఎవరైనా ప్రముఖులు తెలంగాణకు వస్తున్నారంతనే..

సోషల్ మీడియా ద్వారా ప్రశ్నలు సంధించే కొత్త సంప్రదాయానికి తెర తీశారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన అధికారపార్టీ ఎమ్మెల్సీ కవిత.

మొన్నటికి మొన్న కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారంతే.. అప్పటికప్పుడు సిద్ధం చేసుకున్న హడావుడి ప్రశ్నలకు.. అంతకు మించిన ఘాటుతనంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విటర్ లో బదులు ఇవ్వటం.

దానికి సమాధానం ఇచ్చే విషయంలో కవిత పెద్ద ఆసక్తిని ప్రదర్శించలేదు. తాజాగా తెలంగాణకు కేంద్ర హోం మంత్రి అమిత్షా వస్తున్న నేపథ్యంలో.. ఆయనకు తనకు అలవాటైన రీతిలోట్విటర్ లో క్వశ్చన్లను సంధించారు.

-  అమిత్ షాజీ.. రూ.3వేల కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు?

-  వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే గ్రాంట్ రూ.1350 కోట్లు.. జీఎస్టీ పరిహారం కింద రూ.2247 కోట్ల మాటేంది?

-  ఈ రోజు మీరు తెలంగాణ ప్రజలను కలిసినప్పుడు గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఒక్క ఐఐటీ.. ఐఐఎం.. ఐఐఎస్ఈఆర్.. ట్రిపుల్ ఐటీ.. ఎన్ఐడీ.. మెడికల్ కాలేజీ లేదంటే నవోదయా స్కూళ్లను ఇవ్వటంలో కేంద్రం ఎందుకు విఫలమైందో చెబుతారా అమిత్ షాజీ?

-  కర్ణాటకలోని ఎగువ భద్ర నీటిపారుదల ప్రాజెక్టుకు.. కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించారు.

 - రంగారెడ్డి ఎత్తిపోతలపథకం.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా నిరాకరించటం కేంద్ర ప్రబుత్వ కపటత్వం కాదా?  

-  ఆకాశానికి తాకుతున్న ద్రవ్యోల్బణానికి మీ జవాబేంటి?

-  ఎల్ పీజీని అత్యంత ఖరీదైన ఇంధనంగా అమ్మటంలో భారత్ ను అగ్రగామి దేశంగా మార్చటంపై మీ సమాధానం ఏమిటి?

-  కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెరిగిన నిరుద్యోగం.. మతపరమైన అల్లర్లకు మీ సమాధానం ఏమిటి?

-  మిషన్ కాకతీయ.. మిషన్ భగీరథకు రూ.24వేల కోట్లు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సును కేంద్రం ఎందుకు మర్చిపోయింది?
Tags:    

Similar News