టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటికి సుప్రీం కోర్టులో భారీ ఊరట.. రాష్ట్రానికి నోటీసులు?
ఇటీవల కాలంలో ఏపీలోని టీడీపీ ప్రజాప్రతినిధులు. నేతలకు వరుస పెట్టి ఎదురు దెబ్బలు తగులుతున్న సంగతి తెలిసిందే. వారు చేస్తున్న వ్యాపారాలకు సంబంధించి సమస్యలో.. రాజకీయ అంశాలకు సంబంధించిన కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో వారు న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తున్నారు. తాజాగా అలా సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు దేశ అత్యున్నత న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసులకు గొట్టిపాటికి చెందిన గ్రానైట్ కంపెనీ వివరణ ఇవ్వాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై మధ్యంతర స్టే ఉత్తర్వుల్ని జారీ చేసింది.
అంతేకాదు.. ఈ కేసుకు సంబంధించి తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు పైనా స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. జస్టిస్ సూర్యకాంత్.. జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. గొట్టిపాటి రవికుమార్ కు చెందిన కిషోర్ గ్రానైట్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలకు చెంది క్వారీల్లో అవకతవకలు జరుగుతున్నట్లుగా విజిలెన్స్ నివేదిక రూపొందించారు. దీంతో.. ఆ కంపెనీలకు భారీ జరిమానా విధిస్తూ గనుల శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
అంతేకాదు.. రూ.50కోట్ల ఫైన్ కట్టాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ నోటీసుల్ని ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టేయగా.. ఆ తీర్పును డివిజన్ బెంచ్ పక్కన పెట్టింది. మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని కంపెనీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ గొట్టిపాటి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై సోమవారం ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై స్టే విధించి.. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఎమ్మెల్యే గొట్టిపాటికి భారీ ఊరటను ఇవ్వనున్నాయని చెబుతున్నారు. మరి.. సుప్రీంనోటీసులకు రాష్ట్ర ప్రభుత్వం ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.