ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ప్రతిపాదన అంశంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే.. ఊహించని రీతిలో కొందరు ప్రముఖులు సానుకూలంగా స్పందించటం ఆసక్తికరంగా మారింది. మూడు రాజధానుల కారణంగా ఏపీలో డెవలప్ మెంట్ మరింత పెరుగుతుందని.. అన్ని ప్రాంతాలు సమానంగా ఎదిగే వీలు ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అమరావతిలో అసెంబ్లీ.. విశాఖ కార్య నిర్వాహక రాజధాని.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయొచ్చేమోనంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను మెగాస్టార్ చిరంజీవి తన మద్దతు తెలపటం తెలిసిందే. ఓవైపు ఇదే అంశంపై చిరు సోదరుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించటం ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే.. తాజాగా మరో సినీ ప్రముఖుడు జగన్ ఆలోచనకు జై కొట్టారు. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్నారు. పీపుల్స్ స్టార్ గా పేరున్న ఆర్. నారాయణమూర్తి తాజాగా జగన్ నిర్ణయానికి తన మద్దతును ప్రకటించారు. విశాఖలో మాట్లాడిన ఆయన ఏపీలో మూడు రాజధానుల్ని ఏర్పాటు చేయాలన్నారు. మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన తర్వాత అప్పట్లో రాజధాని కర్నూలు నుంచి హైదరాబాద్ కు వెళ్లినప్పుడు రాయలసీమ నష్టపోయిందన్న భావన ఉండేదని.. అప్పటి నుంచి ఇప్పటివరకూ అలాంటి ఆలోచనలోనే ఉన్నారన్నారు. జగన్ మాట తర్వాత ఇప్పుడా ఆలోచనలో నుంచి బయట పడుతున్నారన్నారు.
విభజన అంశంపై నాటి కేంద్రం నియమించిన శ్రీ కృష్ణ కమిటీ సూచించిన అంశాల్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నట్లు చెప్పారు. అందుకే ఆయన తీసుకున్న రాజధానుల నిర్ణయాన్ని తమకు స్వాగతిస్తున్నట్లు చెప్పారు. తొలుత చిరంజీవి.. ఇప్పుడు నారాయణమూర్తి లు మూడు రాజధానులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది.