వైసీపీ అధినేత, సీఎం జగన్ త్వరలోనే రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్టు అత్యంత విశ్వస నీయ వర్గాల ద్వారా సమాచారం బయటకు వచ్చింది. వాస్తవానికి ఎప్పటి నుంచో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని .. సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. 2009 సెప్టెంబరులో ఇదే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తన తండ్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఈ కార్యక్రమంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సీఎం నేరుగా ఎలాంటి మధ్యవర్తులు లేకుండా.. ప్రజలను కలుసుకునిప్రభుత్వ పథకాలు అందుతున్నదీ లేనిదీ తెలుసుకునే ప్రయత్నం చేయాలని భావించారు.
అంతేకాదు.. ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను క్రోడీకరించి.. మరింత మెరుగ్గా.. పాలనను అందించేందుకు రచ్చబండ వంటి కార్యక్రమాలు దోహద పడతాయని అనుకున్నారు. అయితే.. ఈ కార్యక్రమానికి బయలు దేరిన వైఎస్ ఆకస్మికంగా మరణించారు. ఇక, ఆతర్వాత.. ఇన్నాళ్లకు.. ఆయన తనయుడు పెట్టిన పార్టీ అధికారంలోకి రావడంతో వైఎస్ కలల కార్యక్రమంగా పేరున్న ఈ రచ్చబండను మరోసారిలైన్‌లో పెట్టాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే రెండు ముహూర్తాలుకూడా దాటిపోయాయి.
గతంలోనే జగన్ ఈ కార్యక్రమంపై నాయకులకు కొన్ని సూచనలు చేశారు. త్వరలోనే తాను ప్రజల్లోకి వస్తానని.. నేరుగా పథకాల అమలుతీరును తెలుసుకుంటానని ప్రకటించారు. వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభం లోనే 1వ తారీకు నుంచి రచ్చబండ ప్రారంభమవుతుందని.. సీఎం జిల్లాల పర్యటనకు వస్తున్నాని.. తాడేపల్లి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లకు వర్తమానం అందించారు. అయితే.. మరుసటి రోజు ఢిల్లీ ప్రోగ్రాం ఉండడంతో ఇది వాయిదా పడింది.
అయితే.. ఇంతలోనే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న దరిమిలా.. మరోసారి ఈ కార్యక్రమం వాయి దా పడుతుందని అందరూ అనుకున్నారు. అయితే.. ఉద్యోగ సంఘాల ను సంతృప్తి పరిచి.. అప్పుడు కార్యాచరణకు దిగితే బాగుంటుందని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఉద్యోగుల సమస్యలు కూడా తీరిపోయినందున త్వరలోనే అంటే.. ఈ నెల ఆఖరులోనే.. రచ్చబండకు సీఎం శ్రీకారం చుట్టనున్నట్టు తాడేవర్గాలుచెబుతుండడం గమనార్హం.