ప్యారిస్ తో పాటు.. ప్రపంచానికి షాక్ తగిలేలా చేసిన తాజా ఉగ్రదాడికి సంబంధించి.. మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చాయి. అసలీ దాడికి కారణం ఏమిటి? ఎవరు ఈ దారుణానికి పాల్పడ్డారు? దానికి కారణం ఏమిటి? అన్న సందేహాలకు సమాధానాలు లభించాయి.
ఉగ్రవాద దాడిని ప్రత్యక్షంగా చూసిన కొందరి అభిప్రాయం ప్రకారం.. ఈ ఉగ్రవాద దాడికి పాల్పడింది ఐఎస్ ఐఎస్ సంస్థగా తేలుస్తున్నారు. ఉగ్రవాదులు కాల్పులు జరిపే సమయంలో.. సిరియా విషయంలో ఫ్రాన్స్ వేలు పెట్టటంపై తమకున్న ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.
ఉగ్రవాదలు అన్న మాటల్ని తాను విన్నానని.. వారు సిరియా ఇష్యూలో ఫ్రాన్స్ వైఖరిని నిందిస్తూ మాట్లాడటం కనిపించిందని ఒక రేడియో ప్రజంటర్ వెల్లడించారు. ఇక.. యూరోప్ 1 రేడియో స్టేషన్ రిపోర్టర్ జూలియస్ పీర్స్ అయితే ఉగ్రదాడిని దగ్గర నుంచి చూశారు. ఆ భయానక సంఘటన గురించి మాట్లాడుతూ.. ‘‘జనమంతా పెడబొబ్బలు పెట్టారు. ప్రతి ఒక్కరూ నేల మీద పడుకున్నారు. అంతా పది నిమిషాల్లో జరిగిపోయింది. ఆ సమయంలో చాలా తుపాకీ పేలుడు శబ్దాలు వినిపించాయి. ఉగ్రవాదులు చాలా ప్రశాంతంగా.. దృఢ నిశ్చయంతో ఉన్నారు. తమ ఏకే 47 రైఫిల్స్ ను మూడు నాలుగుసార్లు రీలోడ్ చేసుకొని మరీ తుపాకీలతో కాల్పులు జరిపారు. నినాదాలు చేయలేదు. ఉగ్రవాదుల కాల్పుల నుంచి తప్పించుకునేందుకు చాలామంది ఏడుస్తూ కింద పడుకున్నారు. అయినా.. ఉగ్రవాదులు వారిని కనికరించలేదు. వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు’’ అంటూ విలపిస్తూ వివరాలు అందించాడు.
ద బటాక్లాన్ సంగీత కచేరి వద్ద ఒక ఉగ్రవాది మాట్లాడిన మాటల్ని విన్న ప్రత్యక్ష సాక్ష్యులు ఈ ఉగ్రదాడికి కారణం.. సిరియాలో ఫ్రాన్స్ జోక్యం చేసుకోవటంగా తేల్చారు. ఈ విషయాన్ని అధికారికంగా తేల్చాల్సి ఉంది.