ప్రస్తుతకాలంలో ఎన్నికలపై ఉన్న క్రేజ్, అందులోనూ ప్రజాప్రతినిధులుగా గుర్తింపు పొందే చాన్స్ కోసం ఎందరో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కానీ పిలిచి పదవి ఇస్తానంటే...అందులోనూ పెద్దల సభలో బెర్త్ ఖరారు చేస్తామంటే వద్దనడం నిజంగా ఆసక్తికరమే కదా? అలాంటి ఆసక్తికరమైన పనే చేశారు రిజర్వుబ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్. ఒక దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సన్నిహితుడనే పేరున్న రాజన్...రిజర్వుబ్యాంకు గవర్నర్ గా మూడేళ్లపాటున్నారు. అయితే గతంలో నోట్ల రద్దు తదితర అంశాలపై కేందాన్ని విమర్శించారు. దాంతో నరేంద్రమోడీ ప్రభుత్వం ఆయనకు మరో విడుత గవర్నర్ గా పని చేసే అవకాశం ఇవ్వలేదు. దరిమిలా ఆయన అమెరికాకు వెళ్లిపోయారు. అయితే తమ పార్టీ తరఫున రాజ్యసభకు పంపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) భావిస్తోంది.
రాజ్యసభకు పంపే విషయంలో రాజన్‌ను సంప్రదించామని, ఆయన ఇంకా తన నిర్ణయాన్ని తెలుపలేదని తన పేరు బయటపెట్టడానికి ఇష్టపడని ఆప్ నాయకుడొకరు చెప్పినట్లు పీటీఐ వార్తాసంస్థ వెల్లడించింది. ఢిల్లీ రాష్ట్రానికి పాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం వచ్చే ఏడాది మొదట్లో ముగియనుంది. ఆ విధంగా ఖాళీ అయ్యే సీట్లను పార్టీ నేతలతో కాకుండా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులతో భర్తీ చేయాలని ఆప్ యోచిస్తున్నట్లు పార్టీ అధినేత, సీఎం కేజ్రీవాల్ కు సన్నిహితుడైన ఆ నాయకుడు తెలిపారు. ఇందుకోసం రాజన్ తోపాటు, న్యాయ - సామాజిక సేవారంగాలకు చెందిన మరో ఇద్దరిని రాజ్యసభకు పంపించాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాజన్ వంటి వ్యక్తులు రాజ్యసభలో ఉంటే బాగుంటుందని ఆప్ అనుకుంటున్నదని, పార్టీలో అంతర్గత విభేదాల కారణంగానే ఈసారి తమ పార్టీకి చెందని వ్యక్తుల కోసం వెతుకుతున్నదని తెలుస్తోంది.
అయితే, తమ పార్టీ తరఫున రాజ్యసభకు వెళ్లాలంటూ ఆప్ ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌ను ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సున్నితంగా తిరస్కరించారు. తనకు అధ్యాపక వృత్తి అంటే చాలా ఇష్టమని, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో దాన్ని వదిలిపెట్టి రాజ్యసభ సభ్యుడిగా పనిచేయలేనని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రాజన్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. “రఘురామ్ రాజన్ ప్రస్తుతం అధ్యాపక వృత్తిలో కొనసాగుతూ, భారత్ లో కూడా విభిన్న విద్యా కార్యకలాపాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో పూర్తిస్థాయి అధ్యాపకుడిగా కొనసాగేందుకే రాజన్ ఇష్టపడుతున్నాడు” అని అందులో స్పష్టం చేసింది.