మోడీకి కాంప్లిమెంట్లు ఇచ్చిన రాజన్

Update: 2016-06-09 05:37 GMT
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారులో ఆర్ బీఐ గవర్నర్ గా రఘురామ్ రాజన్ ను నియమించిన సంగతి తెలిసిందే. ఆయన పదవీ కాలం ఈ సెప్టెంబర్ తో ముగియనుంది. ఈ మధ్య కాలంలో బీజేపీ సీనియర్ నేత.. ఫైర్ బ్రాండ్ సుబ్రమణ్యస్వామి రాజన్ ను టార్గెట్ చేయటమే కాదు.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తటం.. వ్యక్తిగత విమర్శలు చేయటం కనిపిస్తుంది. మరోవైపు రాజన్ కు.. మోడీ సర్కారుకు మధ్య అంత మంచి సంబంధాలు లేవన్న వాదన ప్రచారంలో ఉంది. సుబ్రమణ్య స్వామిలాంటి వారు ఓపక్క విమర్శనాస్త్రాల్ని ఎక్కుపెట్టటం.. ఆయన్ను ఇంటికి పంపాలన్న వ్యాఖ్యతో పాటు.. ఆయన తీరులో భారతీయత లేదంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తే.. అందుకుభిన్నంగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో రాజన్ ఓ ప్రముఖ ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలుఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు. తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు. మరి.. ఆయన ఏమన్నారన్నది ఆయన మాటల్లోనే చూస్తే..

= సెప్టెంబరు 4 తర్వాత ఏమంతుందో చెప్పలేను. ప్రకటన వచ్చే వరకూ నిరీక్షించాల్సిందే.

= పాఠాలు చెప్పాలన్నది నా చిరకాల కోరిక. పరిశోధన.. విద్యాబోధన నాకు అత్యున్నత అంశాలు.

= ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో మంచి సంబంధాలున్నాయి.

= ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ జోక్యాన్ని ప్రధాని మోడీ ముగింపు పలికారు.

= ద్రవ్యోల్బణం తగ్గుదల ధోరణి ఉంటేనే .. తదుపరి రేటు కోత ఉంటుంది.

= మొండి బకాయిల సమస్యకు ప్రపంచ మందగమన పరిస్థితులు సహా చాలానే కారణాలున్నాయి.

= ప్రభుత్వ కార్యక్రమాల్లోఆర్ బీఐ భాగస్వామ్యం కావాలని మాత్రమే కేంద్రం కోరుకుంటోంది.

= ప్రధాని మోడీ చెప్పినట్లుగా రాజకీయ జోక్యం.. ఫోన్లు చేసి ఆదేశాలు లాంటివి ఏమీ లేవు.

= రుణ బకాయిల విషయంలో రాజకీయ జోక్యం పోయింది.

= మానసికంగా భారతీయుడు కాదంటూ సుబ్రమణ్య స్వామి ఆరోపణపై.. ‘‘ఈ ఆరోపణల్లో అస్సలు అర్థం లేదు. నిరాధారమైనది’’.

= ఆధారాలు లేని అంశాల గురించి మాట్లాడితే ఆ అంశాలకు మరింత బలం చేకూరుతుంది.

= దేశం గురించి ఆలోచించే వారికి దేశం పట్ల ప్రేమ ఉంటుంది.

= కర్మయోగి తన పని తాను చేసుకుపోతాడని మా అత్తగారు చెబుతుంటారు.

= వ్యక్తిగత ఆరోపణల్ని అస్సలు పట్టించుకోను. విధానపరమైన అంశాల్లో తప్పులు ఎత్తి చూపిస్తే పరిశీలిస్తా. తగిన నిర్ణయానికి సైతం వెనుకాడను.
Tags:    

Similar News