జైలు ఎపిసోడ్ గురించి సంచలన అంశాల్ని రివీల్ చేసిన రఘురామ

Update: 2021-12-27 05:03 GMT
సంచలనాల నరసాపురం ఎంపీ రఘురామ క్రిష్ణం రాజును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాను ప్రాతినిధ్యం వహించే వైసీపీలో ఉండి రెబల్ గా వ్యవహరిస్తూ.. సీఎం జగన్మోహన్ రెడ్డి మీదా.. ఆయన ప్రభుత్వం మీద తరచూ విమర్శల్ని సంధించే రఘురామ.. ఇటీవల ఒక ప్రముఖ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వటం తెలిసిందే. గత వారం మొదటి భాగం టెలికాస్ట్ అయితే.. తాజాగా రెండో భాగాన్ని టెలికాస్ట్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఇప్పటివరకు బయటకు ఎక్కడా చెప్పని కొత్త అంశాల్ని రఘురామ నోటి నుంచి వచ్చాయి.

తనను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకొని ఏపీకి తీసుకెళ్లిన పోలీసులు.. జైలుకు తరలించే క్రమంలోనూ రూల్స్ ను పాటించలేదని స్పష్టం చేశారు. పక్కా స్కెచ్ ప్రకారం జైలుకు రప్పించారన్న రఘురామ.. అసలేం జరిగిందో ఆయన మాటల్లోనే చూస్తే..

- ‘‘ఇది ఇప్పటి వరకూ ఎక్కడా చెప్పని విషయం. ఇప్పుడే చెబుతున్నా. నన్ను జైలుకు తీసుకెళ్లినప్పుడు మేజిస్ట్రేట్‌ రెండు ఆస్పత్రులకు తీసుకెళ్లి రిపోర్టు ఇవ్వమని చెబితే... గుంటూరు ఆస్పత్రిలో పరీక్షలు చేయించి మేజిస్ట్రేట్‌ దగ్గరకు తీసుకెళ్లకుండా నేరుగా జైలుకు తీసుకెళ్లారు. అదేంటి.. ఇక్కడకు తెచ్చారేంటని అడిగితే ’ఏయ్‌ దిగవోయ్‌’ అంటూ నెట్టేశారు. చాలా నీచంగా మాట్లాడారు. అలా చేస్తే ఇక్కడొక ఆత్మ.. తాడేపల్లి ఆత్మ పరవశిస్తుందని అలా చేశారు’’

- ‘‘జైలుకు వెళ్లాక.. అన్నీ కొత్తగా ఉన్నాయి. ‘ఈ గదిలోనే జయదేవ్‌గారిని పెట్టాం. మా జైలులో ఉన్న మంచి రూమ్‌ ఇదే’ అని చెప్పారు. నాకు స్నానం చేయడానికి కుర్చీ కావాలని అడిగాను. నిలబడే, నడిచే పరిస్థితి లేదు కదా! జైలులో ఎప్పుడూ కరెంట్‌ పోదట. కానీ ఆ రోజు పోయింది. జనరేటర్‌ ఎప్పుడూ పని చేస్తుందట! ఆ రోజు పని చేయలేదు.

కటకటాలకు దగ్గరగా మంచం వేసుకుని పడుకుందామని అనుకుంటుండగా కరెంట్‌ పోయింది. దాంతో మంచం వెనక్కి లాక్కుని పడుకున్నా. ఇంతలో కరెంట్‌ వచ్చింది. బయట లైట్‌ వేసే ఉంచమని సెంట్రీతో చెప్పి పడుకున్నా. అంతలో మళ్లీ కరెంట్‌ పోయింది. మళ్లీ లేచి మంచాన్ని దూరంగా జరుపుకొన్నా. కటకటాల్లోంచి చేతులు పెట్టి ఏదైనా చేయొచ్చు కదా’’

- ‘‘తర్వాతి రోజు పొద్దున్నే ఒక ఖైదీ నీళ్లు తెచ్చి ఇస్తే స్నానం చేశాను. నేను బయటకు వచ్చిన నెల తర్వాత ముస్లిం పేరుతో ఉన్న నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ఆ నంబరు డీపీ ఏమో జగన్‌ బొమ్మ ఉంది. ఎవరో తిట్టడానికే ఫోన్‌ చేసి ఉంటారని తీయలేదు. అదేపనిగా 20, 30 కాల్స్‌ వచ్చాయి. చివరకు ఫోన్‌ ఎత్తాను. ‘సార్‌ నేను.. మీకు జైల్లో నీళ్లు ఇచ్చాను కదా’ అని పరిచయం చేసుకున్నాడు’’

- ‘‘నువ్వు జైలుసిబ్బందివా లేక అండర్‌ ట్రయల్‌ ఖైదీవా అని అడిగాను. ‘చెక్‌ బౌన్స్‌ కేసులో నన్ను జైలుకు పంపారు.. మీరు వచ్చేసిన తర్వాత రెండు రోజులకు బయటకు వచ్చాను’ అన్నాడు. ఏం చేస్తుంటావని అడిగాను. బెంగళూరులో జగన్‌ ఇంటిలో పనిచేస్తానని అన్నాడు. అతడు చెప్పింది నిజమో కాదో తెలియదు.

కానీ అది వినగానే కళ్లు బైర్లు కమ్మాయి. బెంగళూరులో పని చేయడం ఏమిటి? గుంటూరులో చెక్‌ బౌన్స్‌ ఏమిటని అడిగాను. ‘అవన్నీ అడగొద్దు సర్‌. మీరంటే నాకు అభిమానం. కొంచెం జాగ్రత్తగా ఉండండి’ అని చెప్పాడు.

- ‘‘నన్ను ఫలానా తారీఖున అరెస్టు చేసి ఇక్కడకు పంపాలని ముందుగానే స్కెచ్‌ వేసుకున్నారు. నన్ను జైలుకు పంపడానికి రెండ్రోజుల ముందే అతడిని జైలుకు పంపడం అనుమానాస్పదంగా ఉంది. తర్వాత అతను నాకు టచ్ లో లేడు. అతను నెంబరు కూడా మార్చినట్లున్నారు’’


Tags:    

Similar News