రఘువీరా మాటల్లో హాస్యధ్వని తగ్గడం లేదు..!

Update: 2015-07-18 04:19 GMT
ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఏం మాట్లాడినా అందులో ఈ మద్య కొంత చోద్యం కూడా ఉంటుంది. సీమాంధ్రలో జాడ లేకుండా పోయిన కాంగ్రెస్ ఉనికిని చాటేందుకు యత్నాలు చేస్తున్న రఘువీర చిత్రవిచిత్రమైన ప్రకటనలు చేస్తూ ఉంటారు. ప్రధానంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబును ధ్వజమెత్తుతూ విమర్శలు చేసే రఘువీరారెడ్డి తాజాగా ఆయనను టార్గెట్ చేస్తూ కాస్తంత హాస్యస్పదం అనిపించే ప్రకటన ఒకటి చేశాడు.

ఇంతకీ రఘువీరుడు ఏమంటాడంటే... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లి పోలీసులకు లొంగిపోవాలంటాడు. మరి ఏదో టెర్రరిస్టుకో.. నక్సలైట్లకో.. గజదొంగకో పిలుపునిచ్చినట్టుగా.. ముఖ్యమంత్రిని వెళ్లి పోలీసులకు లొంగిపొమ్మని కోరడం ఏమిటి? అంటే.. ఇక్కడే ఉంది శ్లేష. పుష్కరాల్లో జరిగిన ఘాతుకానికి ముఖ్యమంత్రి చంద్రబాబే కారణం అనే రఘువీరారెడ్డి ఆరోపణ. మూడుగంటల సేపు పుష్కరఘాట్ లో ఉండి.. బాబు అంతమంది మరణానికి కారణం అయ్యాడు అని రఘువీరారెడ్డి ఆరోపించాడు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేయాలని.. డిమాండ్ చేస్తున్నాడు రఘువీరారెడ్డి. అంతమంది మృతికి కారణం అయిన సీఎం ను అరెస్టు చేయడం కాదు.. ఆయనే వెళ్లి పోలీసులకు లొంగిపోవాలని కూడా రఘువీరారెడ్డి సూచించాడు. అలాగే మరో కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పై విరుచుకుపడ్డాడు. పుష్కరాల్లో నమోదైన 29 మంది మరణాలకూ చంద్రబాబే కారణం అని ఆయన తక్షణం రాజీనామా చేయాలని ఆయన కోరుతున్నాడు. మొత్తానికి ఇలా ఉన్నాయి కాంగ్రెస్ నేతల మాటలు.
Tags:    

Similar News