టీడీపీ పొత్తుపై దాటవేసిన రఘువీరా..

Update: 2018-12-14 11:06 GMT
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ పొత్తు వికటించింది. చంద్రబాబు ప్లస్ అవుతాడనుకుంటే కాంగ్రెస్ ను నిలువునా ముంచాడని కాంగ్రెస్ నేతలు లోలోపన బాధపడుతున్నారు. విజయశాంతి లాంటి టీడీపీ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఓపెన్ గానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి టీడీపీ-కాంగ్రెస్ పొత్తు పొడుస్తుందా.? అది ఆంధ్రప్రదేశ్ లోనూ కొనసాగుతుందా అన్న టెన్షన్ ఏపీ కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. లాభం కన్నా నష్టం జరిగిన ఈ రెండు పార్టీల పొత్తుపై తాజాగా ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి హాట్ కామెంట్ చేశారు.

ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తాజాగా కళ్యాణ దుర్గంలో విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్ పొత్తులపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరణ ఇచ్చారు.  పొత్తులపై నిర్ణయం తీసుకునేముందు ఏపీలోని నేతలు - కార్యకర్తల అభిప్రాయాన్ని కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంటుందని తెలిపారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణుల నుంచి లిఖితపూర్వకంగా తీసుకున్న మనోభావాల సారాంశాన్ని అధిష్టానానికి నివేదిస్తానని తెలిపారు.

ఇక తాను వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉన్నా లేకున్నా కళ్యాణ దుర్గం నుంచే ఎమ్మెల్యేగా పోటీచేస్తానని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. కళ్యాణ దుర్గం నుంచి టీడీపీ అధినేత పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో రఘువీరా ఈ మేరకు స్పందించారు. టీడీపీతో పొత్తు ఉన్నా.. లేకున్నా తాను కళ్యాణ దుర్గం నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.  ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానానికి దరఖాస్తు చేసుకుంటానని తెలిపారు.

ఇలా బాబుతో పొత్తు అంశంపై ఏపీ కాంగ్రెస్ నేతలు పునరాలోచనలో పడ్డారు. పొత్తు కంటే విడిగా పోటీ చేస్తేనే ఇరు పార్టీలకు మేలు అన్న తరహాలో రఘువీరా వ్యాఖ్యానించడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 
Tags:    

Similar News