రఘువీరాకు అస్వస్థత

Update: 2015-11-05 09:26 GMT
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అస్వస్థతకు లోనయ్యారు. గురువారం ఆయన విశాఖపట్నంలోని శారదా పీఠంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతున్న సమయంతో అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఒంట్లో చక్కెర స్థాయి ఒక్కసారిగా పడిపోవడంతోనే ఆరోగ్య సమస్య వచ్చిందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

కాగా కొద్దిరోజులుగా రఘువీరా బిజీ షెడ్యూళ్లలో ఉండడం వల్లే ఆరోగ్య సమస్య వచ్చి ఉంటుందని ఆయనతో ఉన్న అనుచరులు చెబుతున్నారు. ప్రత్యేక హోదా పోరాటం మొదలుపెట్టిన రఘువీరా అందుకోసం తిరుగుతున్నారు. బుధవారం ఆయన ఢిల్లీ వెళ్లి అక్కడ జైరాం రమేశ్ కలిసి మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రార్థనలు చేశారు. ప్రత్యేక హోదా పోరాటానికి మహాత్ముని ఆశీస్సులు కావాలంటూ అక్కడ కార్యక్రమం నిర్వహించారు. అక్కడి నుంచి వచ్చిన తరువాతా వివిధ సమావేశాల్లో పాల్గొన్న ఆయన గురువారం ఉదయమే విశాఖ శారదాపీఠం కార్యక్రమంలో పాల్గొన్నారు. నాలుగైదు రోజులుగు తీరిక లేకుండా ఉన్న ఆయనకు నిద్ర సరిగ్గా లేకపోవడం, అలసట వంటి కారణాల వల్ల అస్వస్థతకు లోనయినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు స్పష్టం చేయడంతో కుటుంబసభ్యులు కుదుటపడ్డారు.
Tags:    

Similar News