దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లోక్లీన్ స్వీప్ చేసిన మోడీకి అంతటా భారీ విజయం సాధించటానికి కారణం యూపీలో ఆ పార్టీకి వచ్చిన సీట్లే. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చి 27 నెలలు గడిచిన వేళ.. మోడీ మేజిక్ రాష్ట్రాల ఎన్నికల్లో వర్క్ వుట్ కాని నేపథ్యంలో యూపీ తుది ఫలితం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు.. లోక్ సభ ఎన్నికలకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తిస్తున్నట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్న వేళ.. రాష్ట్రంలో లోకల్ పాలిటిక్స్.. జాతీయ స్థాయిలో మాత్రం ఆ స్థాయిలోనే ప్రజల ఆలోచనా ధోరణి ఉందన్న అభిప్రాయం ఒకటి ఉంది.
దీనికి తగ్గట్లే మోడీ ఘన విజయం సాధించినప్పటికీ ఢిల్లీ రాష్ట్రం మొదలుకొని.. ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ నేపథ్యంలో యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందన్నది కొత్త టెన్షన్ గా మారింది. ప్రస్తుతం అధికారపక్షంగా వ్యవహరిస్తున్న సమాజ్ వాదీ పార్టీకి.. సహజంగానే ఉండే ప్రభుత్వ వ్యతిరేకతను వీలైనంత మేర తగ్గించుకోవటంతో పాటు.. భాగస్వామ్య పక్షంతో పొత్తు కుదుర్చుకోవటం ద్వారా యూపీ ఎన్నికల్లో విజయం పక్కా చేసుకోవచ్చన్న ఆలోచనలో ఉన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్.. తాజాగా కాంగ్రెస్ యువరాజును పొగడ్తలతో ముంచెత్తిన తీరు చూస్తే.. ఈ రెండు పార్టీలు భవిష్యత్తులో మిత్రులుగా మారతారా? అన్నసందేహం కలుగుతున్న పరిస్థితి.
నిజానికి యూపీలో అనుసరించాల్సిన ఫార్ములాపై అఖిలేశ్ యాదవ్ కాస్తంత కసరత్తు చేసినట్లుగా కనిపిస్తోంది. బీహార్ లో ఎలా అయితే రెండు ప్రధాన రాజకీయ పక్షాలతో కలిసి కాంగ్రెస్ కూటమిగా మారి బీహారీల ఓట్లను కొల్లగొట్టిందో అదే రీతిలో యూపీలో వ్యవహరించాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. తాజాగా చోటు చేసుకున్నపరిణామాలు ఇందుకు బలాన్ని చేకూర్చేలా ఉండటం గమనార్హం.
ప్రస్తుతం యూపీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సుదీర్ఘమైన కిసాన్ యాత్రను చేపట్టారు. దాదాపు 2,500 కిలోమీటర్లు వారాల కొద్దీ రాహుల్ తన యాత్రను చేపట్టనున్నారు. ఇలాంటి సమయంలో అధికారపక్షం కలుగజేసుకొని ప్రత్యర్థులపై విరుచుకుపడటం చూస్తుంటాం. ఇందుకు భిన్నంగా తన అడ్డాలో పర్యటిస్తున్న రాహుల్ ను ఉద్దేశించి అఖిలేశ్ ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు.
రాహుల్ మంచివాడని.. ఆయనకు అవసరమైతే.. తాము స్నేహాన్నిఒకరికొకరం పంచుకుంటామని పేర్కొనటం గమనార్హం. ‘‘ఇద్దరు మంచి వ్యక్తులు కలుసుకుంటే అందులో తప్పేముంది’’ అంటూ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. రానున్న రోజుల్లో కాంగ్రెస్.. సమాజ్ వాదీ పార్టీ ల మధ్య బంధం బలోపేటం కావటమే కాదు.. యూపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆసక్తికర పరిణామాల చోటు చేసుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే.. బీహార్ ఫార్మూలాను యూపీలో ఫాలో అయినట్లే.