ఉత్తర్ ప్రదేశ్ లో అధికార సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న గందరగోళం సమసిపోయిందనుకుంటున్న సమయంలో మరో అంశం తెరమీదకు వచ్చింది. కాంగ్రెస్ తో సమాజ్ వాది పొత్తుకు తాను వ్యతిరేకమని ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. కాంగ్రెస్-ఎస్ పీ కూటమికి తాను ప్రచారం చేయనని కూడా ఆయన తెలిపారు. సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయగల సత్తా సమాజ్ వాది పార్టీకి ఉందన్నారు. టిక్కెట్ కోల్పోయిన తమ నేతలందరూ మరో ఐదేళ్ళపాటు అవకాశాన్ని కోల్పోయారని ములాయం వాపోయారు. సమాజ్ వాది పార్టీ నేత జూహి సింగ్ మాట్లాడుతూ ములాయం మనో భావాలను తమ పార్టీ గౌరవిస్తుందని చెప్పారు. అయితే ఎన్నికల ప్రచారం చేయాలని ఆయనను కోరతామని చెప్పారు. అఖిలేష్‌ను సమాజ్ వాది పార్టీ నేతగా ఎన్నికల కమిషన్ గుర్తించి సైకిల్ గుర్తును కేటాయించిన విషయం తెలిసిందే.
ఇదిలాఉండగా... బీజేపీని మట్టి కరిపించడానికే తాము ఏకమైనట్లు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ - ఎస్పీ అధ్యక్షుడు - యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ చెప్పారు. తామిద్దరం సైకిల్ కు రెండు చక్రాల వంటి వారమని - తమ దోస్తీ గంగా - యమునా నదుల సంగమం వంటిదని అన్నారు. బీఎస్పీతో కలిసి పని చేయడంపై ఇద్దరూ భిన్నంగా స్పందించారు. రెండుపార్టీలు కలిసి రాష్ట్రంలో ఉమ్మడి ప్రచారం ప్రారంభించడానికి ముందుగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ - ఎస్పీ అధ్యక్షుడు - యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ లక్నోలో మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ విద్వేష - విచ్ఛిన్నకర రాజకీయాలను ఓడించడానికే ఉత్తరప్రదేశ్ లో తాము చేతులు కలుపుతున్నామని కాంగ్రెస్ - సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నేతలు స్పష్టం చేశారు. కేవలం రాజకీయంగానే కాక వ్యక్తిగతంగానూ తాము మిత్రులమని యువనేతలు చెప్పారు. తమ ఐక్యతకు చిహ్నంగా రాహుల్ - అఖిలేశ్ ఒకేతీరు దుస్తులు..తెల్లటి కుర్తాలు - నల్లటి హాఫ్ కోట్లు ధరించారు. ఈ సమావేశంలో పరస్పరం పొగుడుకున్నారు.
కాగా...అఖిలేశ్ మంచి వ్యక్తి అని రాహుల్ అంటే.. రాహుల్ తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉన్నదని అఖిలేశ్ చెప్పారు. యూపీ ఎన్నికల్లో తాము 405 సీట్లలో 300 సీట్లకుపైగా గెలుచుకుంటామని అన్నారు. తమ పార్టీల గుర్తులను ప్రస్తావిస్తూ, సైకిల్ తో చేయి ఉంటే ఇక వేగం ఎట్లా ఉంటుందో ఊహించుకోండి అఖిలేశ్ అన్నారు. తామిద్దరం సైకిల్ కు రెండు చక్రాల వంటి వారమని అన్నారు. తమ దోస్తీ గంగా యమునా నదుల సంగమం వంటిదని అభివృద్ధి అనే సరస్వతీ నది తమతో కలిసి ఉంటుందని రాహుల్ అభివర్ణించారు. తమ పొత్తును వారు ప్రధాని నరేంద్రమోదీ శైలిలో 4 పీఅని (ఇంగ్లిష్ అక్షరాలతో కూడిన పదాల్లో) పేర్కొన్నారు. కాంగ్రెస్-ఎస్పీల పొత్తు 3పీల(అభివృద్ధి - శేయస్సు - శాంతి) కోసం పని చేస్తుందని రాహుల్ పేర్కొంటే, మరో పీ ప్రజలు అని అఖిలేశ్ జోడించారు. దేశ ప్రజలను క్యూల్లో నిలబెట్టినవారికి (పెద్దనోట్ల రద్దు తరువాత) తమ కూటమి సమాధానం చెప్తుందని అన్నారు. మోదీపాలనతో అచ్ఛే దిన్ ఎప్పుడైనా వచ్చా యా? అని ప్రశ్నించారు. తమది చారిత్రాత్మక కలయిక అని చెప్పారు. రామమందిరం వివాదం కోర్టులో ఉన్నదని, కోర్టు చెప్పినట్లే జరుగుతుందని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ ఉమ్మడి ప్రచారంలో పాల్గొనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు. ప్రియాంక గాంధీ - డింపుల్ కలిసి ఎన్నికల ప్రచారం చేసే విషయా న్ని వారే నిర్ణయించుకుంటారని చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/