ప్రస్తుతం దేశంలో వారసత్వ రాజకీయాలపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులోనూ ప్రముఖంగా ఇద్దరు రాజకీయ వారసుల గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. వారిలో ఒకరు 125 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన రాజకీయ పార్టీకి ఉపాధ్యక్షుడు. రాబోయే కాలంలో కాబోయే ప్రధానిగా కలలు కంటున్న వ్యక్తి. పార్టీ కోసం వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసిన ఘనత ఆయన సొంతం. మరొకరేమో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి పుత్ర రత్నం. పైగా మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. తాతగారు స్థాపించి - నాన్నగారు చేజిక్కించుకున్న ప్రాంతీయ పార్టీకి భవిష్యత్ రథ సారధి ఆయనే. వీరిద్దరిలోనూ చాలా పోలికలున్నాయి. ఇంత ఘన చరిత్ర కలిగి ఉండి కూడా చేసిన పొరపాట్లనే మళ్లీ మళ్లీ చేస్తుండడం వీరి ప్రత్యేకత. వేదికలు మారినా, ఆ ఇద్దరి వైఖరిలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. ఆ ఇద్దరు బాబులలో ఒకరు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అయితే - మరొకరు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ప్రసంగాలలో తప్పులు దొర్లుతున్నప్పటికీ తన తీరు మార్చుకోవడం లేదు. కొద్ది రోజుల క్రితం లోక్ సభ సభ్యుల సంఖ్యను తప్పుగా చెప్పి నాలుక కరుచుకున్నారు. అంతకుముందు బెంగళూరులో 'ఇందిరా క్యాంటీన్'లను ప్రారంభిస్తూ, వాటిని 'అమ్మ క్యాంటీన్' లని సంబోధిస్తూ పొరబడ్డారు. తాజాగా, రాహుల్ మరోసారి పప్పులో కాలేశారు. నిన్న మరణించిన 'మార్షల్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్' అర్జన్ సింగ్ కు సంతాపం తెలిపే సందర్భంగా ఆయన పొరబడ్డారు. ఎయిర్ మార్షల్ అర్జున్ సింగ్ మరణం తనకెంతో బాధను కలిగించిందన్నారు. ఆయన నిజమైన హీరో అని, ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని చెప్పారు. అయితే, అర్జున్ సింగ్ ను 'ఎయిర్ మార్షల్'గా సంబోధించి రాహుల్ మరోసారి తన అజ్ఞానాన్ని చాటుకున్నారు. ఎందుకంటే 'మార్షల్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్' వంటి ఘనమైన హోదా అర్జన్ సింగ్ కు ఉంది. భారత వాయు సేనలో 'మార్షల్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్' ఫైవ్ స్టార్ ర్యాంకు కాగా - 'ఎయిర్ మార్షల్' త్రీ స్టార్ ర్యాంకు. ఇంత తేడాను గమనించకుండా అర్జన్ ను రాహుల్ 'ఎయిర్ మార్షల్ గా సంబోధించడం ఆయన అజ్ఞానానికి పరాకాష్ట అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏఐసీసీ ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న రాహుల్ వాయుసేనపై కనీస అవగాహన లేకుండా మాట్లాడారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.
ఇక టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు మనవడు ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బాబు పరిస్థితి కూడా ఇంచుమించు రాహుల్ లానే ఉంది. గతంలో లోకేష్ ప్రసంగాలలో కోకొల్లలుగా తప్పులు దొర్లిన సంగతి తెలిసిందే. మంత్రిగా ప్రమాణ స్వీకారం అప్పుడు మొదలైన తప్పుల పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అప్పట్లో లోకేష్ భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని జయంతిని చేసేశారు. గ్రామాల్లో నిధులు ఖర్చు పెట్టి సమస్యలు సృష్టిస్తామని చెప్పడం ఆయనకే చెల్లింది. అనేక సందర్భాల్లో సొంత పార్టీపైనే పొరపాటున చాలా సార్లు నెగెటివ్ కామెంట్స్ చేశారు లోకేష్. ఆ తప్పుల దొంతరను కొనసాగిస్తూ తాజాగా కొద్ది రోజుల క్రితం విశాఖలో జరిగిన ఇన్నోవేషన్ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ను కంపెనీగా, దేశంగా సంబోధించి అభాసు పాలయ్యారు. అయితే, మనిషన్న తర్వాత పొరపాట్లు చేయడం సహజం. కానీ, ఆ పొరపాట్లనే అలవాటుగా మార్చుకోవడం లోకేష్ - రాహుల్ లకు పరిపాటిగా మారింది. అందులోనూ రాహుల్ - లోకేష్ స్థాయి నాయకులు ఈ తరహా పొరపాట్లను పదే పదే చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వారసత్వ రాజకీయాల వల్లే ఈ తరహా నాయకులు మనుగడ సాగిస్తున్నారని పలువురు విమర్శస్తున్నారు. ఇటువంటి నాయకులు దేశ భవిష్యత్తును ఏవిధంగా అభివృద్ధి పథంలో నడిపిస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇకపై ఆ ఇద్దరు నాయకులు తమ ప్రసంగాల పట్ల ఎంత వరకు అప్రమత్తంగా ఉంటారో వేచి చూడాలి.