రాహుల్ కు ఆ సీఎం మాట ఇచ్చి మ‌రీ త‌ప్పార‌ట‌!

Update: 2019-05-07 06:54 GMT
ప్ర‌ధాని మోడీకి ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థిగా.. ఆయ‌న ప‌ద‌వికి పోటీదారుగా నిలిచిన కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తాజాగా జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో త‌న ప్ర‌భావాన్ని పెద్ద‌గా చూప‌లేక‌పోయార‌ని చెప్పాలి. ఇదిలా ఉండ‌గా.. తాజాగా ఆయ‌న ఢిల్లీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ను ఉద్దేశించి ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్‌.. ఆమ్ ఆద్మీ మ‌ధ్య పొత్తు కుద‌ర‌క‌పోవ‌టానికి కార‌ణం సీఎం కేజ్రీవాల్ కార‌ణంగా చెప్పారు.

తాజాగా ఢిల్లీలోని చాంద్ నీ చౌక్ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన‌ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా కేజ్రీవాల్ తీరును త‌ప్పు ప‌డుతూ రాహుల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పై అస‌త్య ప్ర‌చారం చేసిన మోడీకి మేలు జ‌రిగేలా 2014లో నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆరోపించారు.

ఢిల్లీలో బీజేపీని అడ్డుకోవాలంటే కాంగ్రెస్‌.. ఆమ్ ఆద్మీలు క‌లిసి పోటీ చేయాల్సిందేన‌ని చెప్పారు. బీజేపీని అడ్డుకునేందుకు వీలుగా.. వారికి అవ‌కాశం ఇచ్చామ‌న్నారు. రెండు పార్టీలు క‌లిసి ప్ర‌చారం చేయాల‌ని.. క‌లిసి పోటీ చేయాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు.

డీల్ లో భాగంగా కాంగ్రెస్ మూడు ఎంపీ స్థానాలు... నాలుగు ఎంపీ స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయాల‌ని తాము ప్ర‌తిపాదించామ‌న్నారు. దీనికి కేజ్రీవాల్ తొలుత ఒప్పుకున్నార‌ని.. త‌ర్వాత హ‌ర్యానా.. పంజాబ్ ల‌లో పొత్తు పెట్టుకోవాల‌న్న అంశాన్ని తెర మీద‌కు తెచ్చార‌న్నారు.అవి కుద‌ర‌క‌పోవ‌టంతో ఢిల్లీ విష‌యంలో ఆయ‌న ఇచ్చిన మాట‌ను వెన‌క్కి తీసుకున్నార‌న్నారు.

బీజేపీని ఎదుర్కోగ‌లిగిన బ‌లం కాంగ్రెస్ కు మాత్ర‌మే ఉంద‌ని.. ఆ విష‌యం మ‌ధ్య‌ప్ర‌దేశ్.. గుజ‌రాత్.. ఛ‌త్తీస్ గ‌ఢ్‌.. పంజాబ్.. రాజ‌స్థాన్ రాష్ట్రాల్లో తాము నిరూపించామ‌న్నారు. త‌న తండ్రి రాజీవ్ ను.. త‌న కుటుంబాన్ని మోడీ ఎంత అవ‌మానించినా.. తాను మాత్రం ఆయ‌న ప‌ట్ల ప్రేమ‌గానే ఉంటాన‌ని వ్యాఖ్యానించారు. డీల్ విష‌యంలో మాటిచ్చి త‌ప్పిన‌ట్లుగా రాహుల్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఢిల్లీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


Tags:    

Similar News