కర్ణాటక రాజకీయాలకు శుభం కార్డు పడిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన యడ్యూరప్ప తన భావోద్వేగ ప్రసంగం ముగింపులో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించి సభ నుంచి వెళ్లిపోయారు. యడ్డీ తన సీఎం పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్, జేడీఎస్ నేతలు సంబురాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. యడ్యూరప్ప రాజీనామా కంటే రాహుల్ చేసిన కామెంట్లే తమను ఇరకాటంలో పడేసేలా ఉన్నాయని బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు.
యడ్యూరప్ప రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్.. ``ఇవాళ ప్రజాస్వామ్యం గెలిచింది. కర్ణాటక ప్రజలకు అభినందనలు. కర్ణాటక విధాన సభలో ఏం జరిగిందో అందరూ చూశారు. స్పీకర్, భాజపా ఎమ్మెల్యేలు జాతీయ గీతం ఆలపించకుండానే సభ నుంచి వెళ్లిపోయారు. ఆర్ఎస్ఎస్-మోడీ, అమిత్‌షా కలిసి ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. దేవెగౌడ, జేడీఎస్ కార్యకర్తలకు అభినందనలు.ఎమ్మెల్యేల కొనుగోలును ప్రధాని మోదీ ప్రోత్సహించారు. ఎమ్మెల్యేలతో ఫోన్‌లో జరిపిన బేరసారాలు బహిర్గతం అయ్యాయి. అవినీతి గురించి మాట్లాడే ప్రధాని.. కర్ణాటకలో అవినీతిని ప్రోత్సహించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ భ్రష్టుపట్టించింది. కర్ణాటకలో బీజేపీ ఆగడాలను అడ్డుకున్నాం. దేశ ప్రజలు, వ్యవస్థల కంటే ప్రధాని గొప్పవాడు కాదు.." అని రాహుల్ అన్నారు. రానున్న ఎన్నికల్లో కర్ణాటక ఫలితాలే దేశమంతా పునరావృతమవుతాయని జోస్యం చెప్పారు. విపక్షాలన్నీ కలిసి వచ్చి ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్, భాజపా ఎమ్మెల్యేలు జాతీయగీతం ఆలపించకుండానే అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారని అన్నారు. ఇదేనా బీజేపీ నేతల దేశభక్తి అంటూ రాహలు్ ఎద్దేవా చేశారు. ఈ కామెంట్లు బీజేపీ నేతలను డిఫెన్స్‌లో పడేశాయిన అంటున్నారు.
ఇదిలాఉండగా...సంఖ్యాబలం లేకపోయినప్పటికీ అప్రజాస్వామికంగా గెలవాలనుకున్న బీజేపీ ఎట్టకేలకూ విశ్వాస పరీక్షలో ఓటమి తప్పదని భావించి విశ్వాస పరీక్షకు ముందే యెడ్డీ రాజీనామా చేశారు. దీనిపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ట్విటర్ ద్వారా స్పందించారు. ``ప్రజాస్వామ్యం గెలిచింది. కర్ణాటక ప్రజలకు, జేడీఎస్ జాతీయాధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ, ఆ పార్టీ ముఖ్యనేత కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీతో పాటు తదితరులకు అభినందనలు. ఇది ప్రాంతీయ పార్టీల ఫ్రంట్ విజయం``అని మమతా పేర్కొన్నారు.