రాహుల్‌ తో క‌మ‌ల్‌...త‌ర్వాత ఏంటి?

Update: 2018-06-20 17:23 GMT

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ 48వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు ప‌లువురు ప్ర‌ముఖులు జ‌న్మ‌దిన శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో కాంగ్రెస్ పార్టీ నేత‌లే కాకుండా...ఇత‌రులు సైతం ఉన్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ సైతం  రాహుల్‌ కు శుభాకాంక్ష‌లు తెలిపిన వారిలో ఉన్నారు. రాహుల్ సుదీర్ఘకాలం - ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు మోడీ ట్వీట్‌ లో ఆకాంక్షించారు.

ప్రముఖ నటుడు - మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ అధినేత కమల్‌ హాసన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిశారు. అనంతరం రాహుల్ తో కమల్ కాసేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమల్‌ హాసన్ మీడియాతో మాట్లాడుతూ..రాహుల్‌ గాంధీని మర్యాదపూర్వకంగానే కలిసినట్లు చెప్పారు. రాహుల్ - తాను తమిళనాడు రాజకీయాలపై చర్చించామని కమల్ అన్నారు. కమల్‌హాసన్ అంతకుముందు డిప్యూటీ ఎన్నికల కమిషనర్ చంద్రభూషణ్‌ ను కలిసి తమ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంశంపై చర్చించారు.ఈ సంద‌ర్భంగా కమల్‌ హాసన్ మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికల సంఘం మా పార్టీకి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగింది. ఈసీ అధికారులు అడిగిన అన్ని వివరాలను అందించాం. మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ గుర్తింపు ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని ఈసీ అధికారులు చెప్పారని వెల్లడించారు. పార్టీ గుర్తుపై ఈసీ ఎలాంటి ప్రశ్నలు వేయనట్లు తెలుస్తోంది. కమల్‌ హాసన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసి..తాజాగా నెలకొన్న పరిణామాలపై చర్చించారు.

కాగా, రాహుల్ గాంధీ భవిష్యత్తులో ప్రధాని అవుతారంటూ బీజేపీకి చెందిన మాజీ నేత సుదీంధ్ర కులకర్ణి తెలిపారు. సోమవారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సీనియర్ నేత ఎల్‌ కే అడ్వాణీ దగ్గర సుధీంధ్ర పనిచేశారు. కశ్మీర్ లాంటి జఠిలమైన వివాదాలను పరిష్కరించే సత్తా రాహుల్‌ కు ఉందన్నారు. పాక్ - చైనాతో ఉన్న దీర్ఘకాలిక సమస్యలను మోడీ పరిష్కరించలేకపోయారని ఆయన ఆరోపించారు.
Tags:    

Similar News