నేపాల్ పబ్ లో రాహుల్ తో ఉన్న ఆమె.. చైనా అంబాసిడర్?

Update: 2022-05-03 13:30 GMT
అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వారికంటూ వ్యక్తిగత జీవితం ఉన్నప్పటికి.. వారి మీద ఉన్న బాధ్యతల బరువుతో కొన్నింటిని మిస్ చేసుకున్నా తప్పు లేదు. గౌరవనీయ స్థానాల్లో ఉన్న వారు కొన్ని చోట్లకు వెళ్లటం.. మరికొందరిని కలవటం ఏ మాత్రం సరికాదన్నది తెలిసిందే. మరి.. ఈ విషయం కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీకి తెలీదా? అన్నది ఇప్పుడు ప్రశ్న. రాహుల్ గాంధీ.. అంటే ఆయన ఒక్కరే కాదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కోట్లాది మంది ఉన్నారు.

ఆ మాటకు వస్తే బీజేపీ వ్యతిరేకులకు.. మోడీషాల భావజాలాన్ని తీవ్రంగా తప్పు పట్టే వారికి ఉన్న ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే. అలాంటప్పుడు అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఏ చిన్న తేడా వచ్చినా జరిగే వ్యక్తిగత నష్టం కంటే కూడా.. పార్టీకి జరిగే డ్యామేజ్ భారీగా ఉంటుందన్నది మర్చిపోకూడదు. యూరోపియన్ దేశాల పర్యటన కోసం వెళ్లిన ప్రధాని మోడీపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దేశంలో పరిస్థితులు ఏ మాత్రం సరిగా లేని వేళ.. విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్నను కాంగ్రెస్ నేతలు పలువురు సంధించారు.

ఇలాంటి సమయంలో.. నేపాల్ లోని తన స్నేహితుడి పెళ్లి కోసం రాహుల్ వెళ్లటాన్ని ఎవరు తప్పు పట్టరు. ఆ మాటకు వస్తే.. పబ్ కు వెళ్లటం కూడా దారుణమైన నేరం.. పాపం కాదు. కానీ.. రాహుల్ గాంధీ స్థాయిలో ఉన్న వారు అలాంటి చోట్లకు వెళ్లి.. చిల్ కావటాన్ని తప్పుగా అర్థం చేసుకునే వీలుందన్నది మర్చిపోకూడదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఖాట్మాండులోని ఒక పబ్ లో రాహుల్ వెంట ఉన్న ఒక అమ్మాయి ఎవరు? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. దీనిపై ఇప్పటికే కొన్ని వాదనలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

రాహుల్ వెంట ఉన్న మహిళ ఎవరో కాదని.. ఆమె ఖాట్మాండులో ఉండే చైనా అంబాసిడర్ గా చెబుతున్నారు. సోమవారం సాయంత్రం 4.40 గంటల వేళలో విస్తారా ఎయిర్ లైన్స్ విమానంలో ఖాట్మాండుకు వెళ్లిన రాహుల్.. సీఎన్ ఎన్ లో పని చేసే తన మిత్రుడి పెళ్లికి వెళ్లినట్లుగా నేపాల్ మీడియాలోనూ కవర్ అయ్యింది. అయితే.. పెళ్లికి వెళ్లిన రాహుల్.. రాత్రి వేళలో పబ్ కు వెళ్లటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ పబ్ లో రాహుల్ వెంట సన్నిహితంగా ఉన్న మహిళ నేపాల్ లో పని చేస్తున్న చైనా రాయబారి యాంకీగా చెబుతున్నారు. గతంలో ఆమెపై పలు ఆరోపణలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆమె నేపాల్ అధ్యక్షుడితో సన్నిహితంగా ఉంటే ప్రయత్నం చేసిందని చెబుతారు. మిగిలిన విషయాలు ఉన్నా.. రాహుల్ పబ్ కు వెళ్లటాన్ని తీవ్రంగా తప్పుపడుతున్న కొందరు.. పార్టీని వదిలేసి నైట్ పార్టీల్లో మునిగిపోవటం ఏమిటి రాహుల్? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

https://twitter.com/thehawkeyex/status/1521348793576288256?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^1521348793576288256|twgr^|twcon^s1_&ref_url=https://telugu.oneindia.com/news/india/rahul-gandhi-is-once-again-in-the-bjp-s-line-of-fire-after-a-video-of-him-at-a-khatmandu-night-pub-317375.html
Tags:    

Similar News