తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం నజర్ పెట్టింది. కొత్త కార్యవర్గం ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పెద్దలు తెలంగాణటూర్ కు రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ రెండో వారంలో రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది.
వరంగల్ లో లేదా మహబూబాబాద్ లో రాహుల్ గాంధీ సభ ఉంటుందని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. సెప్టెంబర్ 17న సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇక రాహుల్ గాంధీ ఇచ్చే సమయాన్ని బట్టి డేట్ మారే అవకాశం ఉందని తెలంగాణ పీసీసీ నేతలు చెప్తున్నారు. ఇక అటు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు కాంగ్రెస్ స్పీడు పెంచింది. ఇవాళ సోనియాగాంధీ విపక్షాల నేతలతో వర్చువల్ గా సమావేశం కానున్నారు. దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలతో పాటు పలువురు సీఎంలు కూడా హాజరయ్యే అవకాశం ఉన్న ఈ భేటిలో ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించనున్నారు.
ఇప్పటికే సోనియా పలు విపక్షాలతో సీఎంలకు సహా, పలువురు కీలక నేతలకు ఆహ్వానాలు పంపారు. ఈ సమావేశంలో దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలతోపాటు వచ్చే ఏడాదిలో జరుగునున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది.