ఆయ‌నే మా బాస్ : సోనియా గాంధీ

Update: 2018-02-08 11:59 GMT
దేశానికి రాజైనా త‌ల్లికి కొడుకే. కొడుకు ప్ర‌యోజ‌కుడైతే ఆ త‌ల్లి ప‌డే ఆనంద‌మే వేరు.  న‌వ మాసాలు మోసిన అమ్మ‌ మ‌నం బుడిబుడి అడుగులు వేస్తూ ప్ర‌పంచ‌లోకి అడుగుపెడితే ఆ అమ్మ‌కు చెప్ప‌రాని సంతోషం . ఆ సంతోషాన్ని కోట్లిచ్చినా కొన‌లేం. ఇప్పుడు మాజీ జాతీయ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ ప‌రిస్థితి కూడా అంతే. 1998 నుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి  అధ్యక్షురాలిగా ప్రారంభ‌మైన ఆమె రాజ‌కీయ జీవితం అంచ‌లంచెలుగా ఎదుగుతూ దేశ రాజ‌కీయాల్లో చ‌క్రంతిప్పారు. ఓ వైపు కుటుంబ‌స‌భ్యుల్ని కోల్పోతున్నా మొక్క‌వోని దీక్ష‌తో మొన్న‌టి వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షురాలిగా సేవ‌లందించారు. అయితే వ‌య‌సు రిత్యా ఆ ప‌దివిని ఆమె కొడుకు రాహుల్ గాంధీకి అప్ప‌గించి విశ్రాంతి తీసుకుంటుంన్నారు. అయితే ఓ పార్టీకి అధ్య‌క్షుడైన  రాహుల్ గాంధీకి త‌ల్లే క‌దా . ఓ వైపు త‌న కొడుకు అస‌మ‌ర్ధ‌త‌ను తిప్పుకొడుతూ ప్ర‌తిప‌క్షాల‌కు స‌వాల్ విసిరిన సంఘ‌ట‌న ఉన్నాయి. కానీ రాహుల్ గాంధీ కి ప‌ట్టాభిషేకం త‌రువాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో రాహుల్ గాంధీ స్టామీనా ఎలాంటిదో ప్ర‌పంచానికి ప‌రిచయం చేసింది.

ఈ నేప‌థ్యంలో పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు హాజ‌రైన ఆమె త‌న కొడుకు  రాహుల్ గాంధీ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాహుల్ గాంధీ బాధ్య‌త‌ల అనంత‌రం తొలిసారి మాట్లాడిన సోనియా రాహుల్ త‌మ‌కు బాస్ అని ఆయ‌న నాయ‌క‌త్వంలో పార్టీ శ్రేణులంద‌రు క‌లిసి క‌ట్టుగా ప‌నిచేయాల‌ని సూచించారు. అంతేకాదు పార్టీ ప‌గ్గాలు రాహుల్ అప్ప‌గించినా బీజేపీ అస‌మ‌ర్ధ పాల‌న‌కు వ్య‌తిరేకంగా  జ‌రిగే అన్నీ కార్య‌క్ర‌మాల్లో తాను పాల్గొంటున్న‌ట్లు పున‌రుద్ఘాటించారు.  

ప్రస్తుతం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్‌గా కొనసాగుతున్న సోనియా గాంధీ... తాను కూడా పార్టీ అధ్యక్షుడితో కలిసి పనిచేస్తానన్నారు. ‘‘నేను కూడా పార్టీ అధ్యక్షుడితో కలిసి పనిచేస్తాను. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సమాయత్తం కావాలనీ.. 2004లో మాదిరిగా పార్టీ గెలుపు కోసం శ్రమించాలని నేతలకు పిలుపునిచ్చారు.
Tags:    

Similar News