అడ్డదిడ్డంగా.. హడావుడిగా.. ఎలాంటి ముందు చూపు లేకుండా ఏపీని ముక్కలు చేయటంలో కీలకభూమిక పోషించిన కాంగ్రెస్ పార్టీ యువరాజు.. రాహుల్ గాంధీ ఏపీకి వచ్చేశారు. రైతుల సమస్యలపై దేశవ్యాప్తగా పర్యటిస్తున్న ఆయన.. అందులోభాగంగా తాజాగా ఏపీలో పర్యటిస్తున్నారు.
ఏపీలోని అనంతపురం జిల్లాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఉదయం ఢిల్లీ నుంచి విమానం ద్వారా బెంగళూరుకు చేరుకున్న ఆయన.. అక్కడ నుంచి రోడ్డు మార్గం గుండా అనంతపురం జిల్లా కొడికొండ చెక్ పోస్ట్ కు చేరుకున్నారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఆయన.. కాసేపట్లో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు.
అనంతపురం జిల్లాకు చేరుకున్న రాహుల్ గాంధీకి కాంగ్రెస్ వర్గాలు ఘనంగా స్వాగతం పలికాయి. భారీ తనానికి తగ్గకుండా కిందామీదా పడిన మరీ.. కాంగ్రెస్ నేతలు కార్యకర్తల్ని సేకరించారు. విభజన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడని రాహుల్.. ఆత్మహత్యలు చేసుకున్న రైతల్ని పరామర్శించేందుకు వస్తున్నారు.
ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాల దీన స్థితి మీద స్పందిస్తున్న రాహుల్.. విభజన కారణంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఏపీని సముదాయించేలా.. సాంత్వన చేకూరేలా ఎందుకు పోరాడరు? ప్రత్యేక హోదా గురించి ఎందుకు ఉద్యమం చేయరు? విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీల అమలు గురించి ఎందుకు పెదవి విప్పరు..?