ఉపాధి హామీ పథకం గొప్పదే... దేశంలో ఎవరైనా ఆ విషయాన్ని అంగీకరించి తీరాలి. అయితే.. అందులోనూ లాభనష్టాలు, మంచీ చెడులు ఉన్నాయి. ఉపాధి కల్పించడం మాటున ఎన్నో అనవసర పనులతో అవసరమైన పనులు మరుగున పడుతున్నాయి. సొంత పనులు ఉపాధి హామీ ఖాతాలో పడుతున్నాయి. అయితే... గ్రామీణ కూలీలకు ఏడాదంతా పని కల్పించడం, గిట్టుబాటు కూలీ కల్పించడం వంటి విషయాల్లో మాత్రం ఇది తిరుగులేనిది. తాజాగా ఉపాధి హామీకి పదేళ్లు పూర్తయిన సందర్భంగా అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ - మాజీ ప్రధాని మన్మోహన్ లు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సభలో రాహుల్ ఉపాధి హామీ గురించి చెబుతున్న సుత్తి వినలేక సభికులు నానా ఇబ్బంది పడ్డారట. చెప్పిందే చెప్పి రాహుల్ విసిగించారట. అంతేకాదు... ప్రపంచ దేశాల అధినేతలు ఎందరో ఈ పథకాన్ని తమ దేశాల్లో అమలు చేస్తామన్నారంటూ రాహుల్ చెప్పడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రపంచంలో భారత్ వంటి దేశాలు చాలా తక్కువ. ఇప్పటికే చాలాదేశాల్లో మానవ వనరుల కొరత ఉంది. అంతేకాదు... ఉపాధి అమలయ్యే రంగాల్లో మెకనైజేషన్ పూర్తిస్థాయిలో ఉంది. అలాంటప్పుడు ఆయాదేశాల్లో ఈ పథకం ఎలా అమలు చేస్తామని చెప్పారో రాహుల్ కే తెలియాలి.
జాతీయ ఉపాధి హమీ పధకం యునిసెఫ్ - వరల్డ్ బ్యాంకు వంటి సంస్ధలను ఆకట్టుకుంటుందని రాహుల్ చెప్పారు. ఉపాధి హమీ పధకం అమలులోకి వచ్చిన తరువాతే పేదల ఇళ్లలో అన్ని సౌకర్యాలు సమాకూర్చుకోవడం ప్రారంభించారని ఆయన తెలిపారు. ఇదంతా బాగానే ఉన్నా ఉపాధి హామీని ఇంటర్నేషనల్ స్కీం అని చెప్పడమే విడ్డూరంగా అనిపించింది.