కాంగ్రెస్ కు తప్పని నకిలీ రాహుల్ గాంధీల బెడద!

Update: 2019-04-07 09:01 GMT
ప్రధాన పార్టీ అభ్యర్థులకు నకిలీల బెడద తప్పడం లేదు. ఏపీలో అలాంటి రాజకీయాన్నే చేస్తూ ఉన్నాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పోలినటువంటి పేర్లతో అనేక నియోజకవర్గాల్లో ప్రజాశాంతి పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు అయ్యాయి. ముప్పై ఎనిమిది నియోజకవర్గాల్లో అచ్చం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థి పేరును పోలినటువంటి వారి పేరుతో నామినేషన్లు దాఖలు అయ్యాయి. వారంతా ప్రజాశాంతి పార్టీ తరఫునే పోటీ చేశారు.

ఫ్యాన్ ను పోలి ఉండేట్టుగా ప్రజాశాంతి పార్టీకి హెలికాప్టర్ గుర్తును తీసుకున్నారు. ఇక అభ్యర్థుల పేర్లు  కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పోలినట్టుగానే ఉన్నాయి. ఇదంతా ఒక గేమ్ అని స్పష్టం అవుతోంది. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది.

ఇక కేరళలోనూ ఇలాంటి గేమ్సే కొనసాగుతున్నాయి. అక్కడ రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ లోక్ సభ సీట్లో అదే పేరుతో పలు నామినేషన్లు దాఖలు అయ్యాయి. అంటే కాంగ్రెస్ తరఫు నుంచి హస్తం గుర్తు మీద రాహుల్ గాంధీ పోటీ చేస్తూ ఉండగా.. రాహుల్ గాంధీ అనే పేరుతో కొంతమంది ఇండిపెండెంట్ల తరఫున కూడా నామినేషన్లు దాఖలు అయ్యాయి!

రాహుల్ గాంధీ కాక.. ఇలాంటి పేర్లతోనే మరో ముగ్గురు అభ్యర్థులు అక్కడ పోటీలో నిలవడం విశేషం. వారిలో ఒక అభ్యర్థి పేరు కేఈ రాహుల్ గాంధీ, ఇక మక్క కళగం అనే పార్టీ తరఫున రఘుల్ గాంధీ పేరుతో ఒక అభ్యర్థి నామినేషన్ వేశాడు! ఇక శివప్రసాద్ గాంధీ పేరుతో మరో అభ్యర్థి కూడా రంగంలోకి దిగాడు.

వీళ్లంతా రాహుల్ గాంధీ కి నకిలీలు అని, వీళ్లు పోటీ చేస్తున్నది రాహుల్ కు పడే ఓట్లలో ఎన్నో కొన్నింటిని చీల్చడానికే అని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి రాహుల్ గాంధీకి కూడా నకిలీల బెడద తప్పడం లేదు. వీళ్లు ఎన్ని ఓట్లను చీలుస్తారో చూడాలి!
Tags:    

Similar News