బాత్‌రూముల్లో తొంగిచూస్తున్న మోడీ

Update: 2017-02-11 12:18 GMT
కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్ర‌ధానమంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ పై రాజ్య‌స‌భ‌లో ప్ర‌ధాని మోడీ చేసిన ఆరోప‌ణ‌ల‌కు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఘాటు కౌంట‌ర్ ఇచ్చారు.  ప్ర‌ధానికి బాత్‌రూమ్‌లోకి తొంగిచూసే అల‌వాటు ఉన్న‌ట్లు తెలుస్తుంద‌ని విమ‌ర్శించారు. లక్నోలో ఆ రాష్ట్ర సీఎం, మిత్ర‌ప‌క్ష‌మైన స‌మాజ్‌వాదీ పార్టీ నాయ‌కుడు అఖిలేశ్ యాద‌వ్ తో క‌లిసి ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల రాజ్య‌స‌భ‌లో మోదీ చేసిన కామెంట్స్‌ను ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగంపై ధ‌న్య‌వాద తీర్మానంలో ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని స్కామ్‌లు చుట్టేసినా, మ‌న్మోహ‌న్ మాత్రం క్లీన్‌గా బ‌య‌టపడ్డారన్న ఉద్దేశంతో మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌కు రెయిన్‌కోట్‌లో స్నానం చేయ‌డం బాగా తెలుసని వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే.  పేర్కొవ‌డంపై మండిప‌డ్డారు. ఇత‌రుల బాత్‌రూమ్‌ల్లోకి తొంగి చూసే అల‌వాటు ప్ర‌ధాని మోడీకి ఉంద‌న్నారు.

పెద్ద నోట్ల ర‌ద్దుపై సీనియ‌ర్ ఆర్థిక‌వేత్త అయిన మ‌న్మోహ‌న్ తీవ్రంగా త‌ప్పుప‌ట్టినందుకు ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌డం ప్ర‌ధాన‌మంత్రి గొప్ప‌త‌నానికి నిద‌ర్శ‌న‌మ‌ని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. పెద్ద‌రికాన్ని కాపాడుకుంటున్నారా లేదా త‌గ్గించుకుంటున్నారా ఆలోచించుకోవాల‌ని రాహుల్ అన్నారు. కాగా గూగుల్‌లో తన పేరుమీద సెర్చ్ చేస్తే జోకులు వ‌స్తాయ‌ని మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌ను కూడా కాంగ్రెస్ యునేత తిప్పికొట్టారు. ప్ర‌ధాని గూగుల్‌ను సెర్చ్ చేస్తారు కానీ, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌లేర‌న్నారు. రెండున్న‌ర ఏళ్ల పాల‌న‌లో మోడీ విఫ‌ల‌మ‌య్యార‌ని రాహుల్ విమర్శించారు. ఇదిలాఉండ‌గా.. బహుజన్ సమాజ్ పార్టీపై ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ ఓట్లను బీఎస్పీ మళ్లించి బీజేపీకి లాభం కలిగించిందని విమర్శించారు. బీఎస్పీకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే అన్నారు. ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. 403 అసెంబ్లీ సీట్లు ఉన్న యూపీలో శనివారం నుంచి మార్చి 8 మధ్య ఏడుదశల్లో ఎన్నికలు జరుగుతాయి.
Tags:    

Similar News