దేశంలో కరోనా కేసులు రోజూ రెండు లక్షలకు పైగా నమోదు అవుతున్నాయి. అయితే , ఈ నేపథ్యంలోనే ఆక్సిజన్ సిలిండర్లకు కొరత బాగా ఏర్పడింది. ఒక్క సిలిండర్ అయినా ఉంటే ఇమ్మంటూ ఆస్పత్రుల్లో డాక్టర్లే సరఫరా దారుల దగ్గరకు వచ్చి అడుగుతున్నారు అంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల మధ్య భారతీయ రైల్వే శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ లను వచ్చే కొన్ని రోజులపాటూ నడపబోతున్నట్లు తెలిపింది. ఈ ఎక్స్ ప్రెస్ లలో ప్రయాణికులు ఉండరు. సరుకులు కూడా ఉండవు. వీటిలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లు ఉంటాయి.
ఈ రైళ్లు దేశంలోని నలుమూలలకూ వెళ్లి, ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లను చేరవేస్తాయి. ఇప్పటికే ఖాళీ ట్యాంకర్లు ఆక్సిజన్ లిక్విడ్ నింపుకునేందుకు కలంబోలీ, బోయిసార్ రైల్వే స్టేషన్ల నుంచి బయలుదేరాయి. ఇవి విశాఖపట్నం, జంషెడ్‌పూర్, రూర్కెలా, బొకారోకి వెళ్లి ఆక్సిజన్ నింపుకుంటాయి. ఈ రైళ్లు ఆక్సిజన్‌ను సేకరించిన తర్వాత డిమాండ్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు సరఫరా చేస్తామని రైల్వే శాఖ వెల్లడించింది. ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ సాఫీగా ప్రయాణం సాగించేలా హరిత కారిడార్ ను సృష్టిస్తామని తెలిపింది. ఏప్రిల్ 17న రాష్ట్రాల్లోని ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లతో రైల్వే శాఖ సమావేశం నిర్వహించింది. అందులో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను రైళ్లపై తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది. రాష్ట్రాలు ఓకే చెప్పాయి. కాబట్టి వీలైనంత త్వరగా రైళ్లపై ఆక్సిజన్ ట్యాంకర్లను తరలిస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా రైల్లేల్లో ఐసోలేషన్ బెడ్స్ పెంచే యోచనలో ఉన్నట్లు కేంద్ర మంత్రి మరో ట్వీట్ లో తెలిపారు. రాష్ట్రాల డిమాండ్‌ను బట్టి , మూడు లక్షల ఐసోలేషన్ బెడ్స్ ఏర్పాటు చేయవచ్చునని వెల్లడించారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ స్టేషన్ 25 కోచ్ ల్లో షకూర్ బస్తీ స్టేషన్ లో 800 బెడ్స్ ఐసోలేషన్ కోచ్ లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
భారత్ లో కొత్తగా 2,73,810 కరోనా కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,50,61,919కి చేరింది. కొత్తగా 1,619 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1,78,769కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.2 శాతానికి పెరిగింది. తాజాగా 1,44,178 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,29,53,821కి చేరింది. ప్రస్తుతం దేశంలో 19,29,329 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 13,56,133 మందికి కరోనా పరీక్షలు చేశారు. భారత్ లో ఇప్పటి వరకు 26 కోట్ల 78 లక్షల 94వేల 549 టెస్ట్ లు చేశారు. కొత్తగా 12,30,007 మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటివరకు 12 కోట్ల 38 లక్షల 52వేల 566 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.