యోగాతో ఎన్ని ప్రయోజనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ ప్రయోజనాలను ప్రపంచ దేశాలకు తెలియజేశారు ప్రధాని మోడీ. అయితే, యోగా మ్యాట్ తో కూడా అనేక ప్రయోజనాలున్నాయని లఖ్ నవ్ వాసులు చాటి చెప్పారు. తమ వినూత్న ఆలోచనతో అందరి దృష్టిని ఆకర్షించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా లఖ్ నవ్ లో బుధవారం మోడీ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమాని భారీగా అభ్యాసకులు తరలివచ్చారు. వారి కోసం మైదానంలో మ్యాట్ లను పరిచారు. మ్యాట్ ల వల్ల యోగాభ్యాసకులకు సౌకర్యంగా ఉంటుందని నిర్వాహకులు భావించారు.
అనుకోకుండా వర్షం పడడంతో యోగాభ్యాసకులు కొంత అసౌకర్యానికి గురయ్యారు. అయితే, తెలివిగా ఆలోచించి వర్షం నుంచి తప్పించుకునేందుకు ఆ మ్యాట్ లను తమపై కప్పుకున్నారు. అంత వర్షంలోనూ వారందరూ ఉత్సాహంగా యోగా చేయడం విశేషం.
గతంలో రాహుల్ ఏర్పాటు చేసిన సభలో ప్రజలు మంచాలను ఎత్తుకెళ్లిన ఘటన గుర్తుందిగా. అదే తరహాలో కొందరు కార్యక్రమం ముగిసిన తరువాత ఆ మ్యాట్‌లను కప్పుకుంటూ మెల్లగా జారుకునే ప్రయత్నం చేశారు. అయితే గేటు దగ్గరున్న సెక్యూరిటీ సిబ్బంది ఆ మ్యాట్‌లను తీసుకుని వారిని పంపించడం కొసమెరుపు. మనవాళ్లు ఫ్రీగా వస్తే మ్యాట్ లనూ వదలరు కదా!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/