అపశృతి; 15 మందికి పెరిగిన పుష్కర మృతులు

Update: 2015-07-14 04:49 GMT
ఉత్సాహంగా మొదలైన గోదావరి పుష్కరాల్లో అపశృతి చోటు చేసుకుంది. తొలిరోజు పుష్కర స్నానం చేసేందుకు ఉత్సాహంగా తరలి వచ్చిన లక్షలాది మంది భక్తులతో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది.

పుష్కరాల సందర్భంగా రాజమండ్రి కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం మొత్తం 15 మంది మృతి చెందారు. మరో 15 మంది వరకూ తీవ్రంగా గాయపడినట్లు చెబుతున్నారు.  

తొక్కిసలాటకు కారణాలు చూస్తే.. ఏపీ ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యంగా చెబుతున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్లుగా ఏర్పాటు చేయటంలోనూ.. ముంచుకొచ్చే ప్రమాదాల్ని పసిగట్టటంలో యంత్రాంగం విఫలం చెందటంతో ఈ దారుణం చోటు చేసుకుందని చెబుతున్నారు.

 వీవీఐపీలు ఘాట్ల దగ్గర పుష్యస్నానాలు ఆచరించే సమయంలో భక్తుల్ని అధికారులు నిలువరించారు. దీంతో.. భక్తులు పెద్ద సంఖ్యలో ఉండిపోయారు. భక్తులను ఘాట్లలోకి అనుమతించే సమయంలో చోటు చేసుకున్న లోటుపాట్ల కారణంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇదే మృతుల సంఖ్య భారీగా ఉండటానికి కారణం అవుతుందన్న వాదన వినిపిస్తోంది. . ప్రతిష్ఠాత్మకంగా పుష్కర ఏర్పాట్లు చేశామని చెప్పుకున్న చంద్రబాబు సర్కారు పని తీరు మీద తాజా ఘటన విమర్శలు వెల్లువెత్తుతున్నాయ.
Tags:    

Similar News