రాజమండ్రి జైల్ స్పెషల్; భూగర్భంలో ఉరికంబం

Update: 2015-08-17 05:20 GMT
ఉరిశిక్ష అమలుపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంటే..అందుకు భిన్నంగా రాజమండ్రి జైల్లో భూగర్భంలో ఏర్పాటు చేసిన ఉరికంబం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉరిశిక్షను అమలు చేసే ఉరికంబాన్ని భూగర్భంలో ఏర్పాటు చేయటం దేశంలోనే ఇదే తొలిసారిగా చెబుతున్నారు.

రాజమండ్రి జైల్లో ఉరికంబం ఎప్పటి నుంచో ఉన్నా.. మారిన పరిస్థితులకు అనుగుణంగా.. మరమ్మతుల కారణంగా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉరిశిక్షను అమలు చేసేందుకు వీలుగా.. భూగర్భంలో ఉరికంబాన్ని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. తాజాగా రూ.7.5కోట్లతో పరిపాలనా భవనాన్ని ఏర్పాటు చేశారు. దీంతో.. ఇంతకాలం ఉన్న ఉరికంబం ప్లేస్ ను మార్చాల్సి రావటంతో.. కొత్త ఉరికంబం (గ్యాలోస్) భూగర్భంలో ఏర్పాటు చేశారు.

రాజమండ్రి జైల్లో ఉరిశిక్ష అమలును 1875 నుంచి అమలు చేస్తున్నారు. ఉరిశిక్ష విధిస్తే.. దాన్న అమలు చేయటానికి అవసరమైన ఏర్పాట్లు 1875 నుంచి ఉన్నాయి. అప్పటి నుంచి 1980 వరకూ జైలు ప్రధాన ద్వారం పక్కనే గ్యాలోస్ ఉండేది. అనంతరం 1980లో ఆడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లోని ఖాళీ స్థలంలోకి దీన్ని మార్చారు. తాజాగా.. ఆడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ను కొత్తగా నిర్మించటంతో ఉరికంబాన్ని వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దీంతో.. తాజాగా భూగర్భంలో ఉరికంబాన్ని ఏర్పాటు చేశారు. ఈ జైల్లో ఉరిశిక్షను చివరిసారి 1976 ఫిబ్రవరిలో అమలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ రాజమండ్రి జైల్లో ఉరిశిక్షను అమలు చేయలేదు.
Tags:    

Similar News