పాపం రాజమండ్రి ఎంపీ.. ఎక్కడ ఎప్పుడు చేశాడో తెలియదు కానీ.. ఆయన ప్రత్యర్థి టీడీపీ బ్యాచ్ కు దొరికేశాడు. ఓ అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన ఓపెనింగ్ సెర్మనీని టీడీపీకి సంబంధించిన వాళ్లు పట్టేసి రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.
రాజమండ్రి వైసీపీ యువ ఎంపీ మార్గాని భరత్ ఓ ప్రభుత్వ ఆఫీసులో సీసీటీవీనో లేక ఏదైనా వీడియో కాన్ఫరెన్స్ సర్వర్ నో ఓపెన్ చేసినట్టు ఫొటో చూస్తే కనిపిస్తోంది. బహుషా తహసీల్దార్ ఆఫీసులో అధికారిక కార్యక్రమం అయ్యిండొచ్చు. అయితే ఆయన టీవీని ప్రారంభించినట్టుగా టీడీపీ బ్యాచ్ ట్రోల్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది. మామూలుగా అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, రిబ్బన్ కటింగ్ లు చేయడం అలవాటు.. అలానే ఎంపీ భరత్ ప్రారంభింపచేశారు. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ ఆ ఫొటోను పట్టుకొని ఇప్పుడు టీడీపీవోళ్లు నానా యాగి చేసి పడేస్తున్నారు.
ఎంపీ మార్గాని భరత్ ఓ టీవీకి ఉన్న రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఫొటో ఒకటి టీడీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో పట్టేశారు. ఇంకేం.. కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందంగా వారి ఆనందానికి.. వ్యంగ్యానికి.. సెటైర్లకు అడ్డులేకుండా పోయింది. ‘రాజమండ్రి వైసీపీ ఎంపీ శ్రీ భరత్ గారి చేత మరో భారీ ప్రాజెక్ట్ ఓపెనింగ్’ అంటూ హెడ్డింగ్ పెట్టి ఆయన ఓ చిన్న టీవీని ప్రారంభించే ఫొటోను షేర్ చేస్తూ తెగ ఆడేసుకుంటున్నారు. జగన్ ను, ప్రత్యర్థి జనసేన పార్టీని అందరినీ ట్యాగ్ లు చేస్తూ మరీ వైరల్ చేస్తున్నారు.
ఎంపీ దొరికిన పాపానికి ఆయనను సోషల్ మీడియాలో ఒకటే సెటైర్లతో చంపేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలానే బుక్కైపోతారనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు.