అమ‌రావ‌తి కోసం రాజ‌మౌళి ప‌ని మొద‌ల‌యింది

Update: 2017-10-15 05:26 GMT
లండన్‌ వెళ్లిన దర్శకుడు రాజమౌళి.. అమరావతి డిజైన్స్ పరిశీలిస్తున్నారు. సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్‌తో కలిసి రాజమౌళి లండన్‌లో అమరావతి డిజైన్స్ రూపొందిస్తున్న నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులతో సమావేశమ‌య్యారు. వారు  రూపొందించిన ఆకృతుల్లో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పలు మార్పులు సూచించారు.

అమ‌రావ‌తి డిజైన్ల విష‌యంలో కొద్ది రోజుల కిందట ఫోస్టర్‌ సంస్థ ఇచ్చిన తుది డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు తిరస్కరించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే రాజమౌళిని సంప్రదించాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అనంత‌రం రాజ‌మౌళి సీఎం చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. లండ‌న్‌లో ప‌ర్య‌టించేందుకు అంగీకారం వ్య‌క్తం చేశారు. తాజాగా మంత్రి నారాయ‌ణ‌, క‌మిష‌న‌ర్ శ్రీ‌ధ‌ర్‌తో క‌లిసి నార్మ‌న్ ఫోస్ట‌ర్ సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా  అమరావతిలో భవనాల డిజైన్లు ఎలా ఉండాలనే దానిపై సదస్సులో రాజమౌళి భవనాల డిజైన్లు ఎలా ఉండాలనే దానిపై దర్శకుడు రాజమౌళి ఒక ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అసెంబ్లీ భవనం ఎలా ఉండాలి, ఇక్కడి చరిత్ర, సంస్కృతి, వారసత్వం తదితర అంశాలను ఆయన వివరించినట్లు తెలిసింది. మరోవైపు ఈనెల 23 నుంచి చంద్రబాబు నాయుడు లండన్‌లో పర్యటించనున్నారు. ఆ సమయంలో నార్మన్ పోస్టర్ సంస్థ రూపొందించిన డిజైన్లను చంద్రబాబు ఫైనల్ చేయనున్నారు.
Tags:    

Similar News