తెలంగాణ బీజేపీలో ఫైర్ బ్రాండ్ నాయకుడు, ఘోషామహల్ ఎమ్మెల్యే విషయం ఆసక్తిగా మారింది. వివాదాస్పద వ్యాఖ్యలతో జైలుపాలైన రాజాసింగ్ ఎట్టకేలకు బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే, ఆయనను పార్టీ నాయకులు పట్టించుకోలేదు. బీజేపీ అధిష్టానం ఆయనపై వేసిన సస్పెన్షన్ వేటును కొనసాగిస్తూనే ఉంది. దీంతో, రాజాసింగ్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలనే దానిపై ఆలోచనలో పడ్డారని బీజేపీలోని రాజాసింగ్ మద్దతు వర్గం చెబుతోంది.
ఇటీవల మర్రి శశిధర్ రెడ్డి.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన సందర్భంలో రాజాసింగ్ గురించి చర్చించారని అంటున్నారు. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను అమిత్ షా కూడా తప్పుపట్టారని సమాచారం. రాజాసింగ్‌పై రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సానుకూలంగా ఉన్నప్పటికీ సస్పెన్షన్‌పై అధిష్టానం సహా రాష్ట్రానికే చెందిన కొందరు నాయకులు పట్టు వీడడం లేదని తెలుస్తోంది. దీంతో ఇప్పట్లో దీనిని ఎత్తేసే అవకాశం లేదని తెలుస్తోంది.
మరోవైపు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కొన్నాళ్ల కిందట రాజాసింగ్ భార్య కలిశారు. ఆయనపై సస్పెన్షన్ వేటు ఎత్తేయాలని కోరారు. ఇక, అంతకుముందే రాజాసింగ్ పార్టీకి పూర్తి స్థాయిలో వివరణ కూడా ఇచ్చారు. అయితే, రాజాసింగ్‌పై బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది బీజేపీ నేతలతో రాజాసింగ్‌కు విభేదాలున్నాయి.
అదే ఇప్పుడు రాజాసింగ్‌కు, పార్టీకి మధ్య అగాధం పెంచుతున్నాయి. కేంద్రంలోనూ రాజాసింగ్‌కు మద్దతుగా నిలిచే వారు ఉన్నప్పటికీ బహిరంగంగా బయటకు రాలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో రాజాసింగ్ పార్టీ మార్పు ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. ఇదిలావుంటే, రాజాసింగ్ ప్రస్తుతం తన నియోజకవర్గంలో పని చేసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బీజేపీ తనపై వేటు తొలగించని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై సన్నిహితులతో మాట్లాడుతున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలా?. బీజేపీకి వ్యతిరేకం కాకుండా సొంతంగా ఒక కొత్త వేదిక ఏర్పాటు చేసుకోవాలా అన్న దానిపై తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది. అయితే, ఆయన వేరే పార్టీలో చేరడం ఖాయమని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.