వ్వా..ఏం ఐడియా: రాజ‌స్థాన్‌ లోని ఓ గ్రామం వినూత్న నిర్ణ‌యం

Update: 2020-04-17 22:30 GMT
ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్‌ పై ప‌ట్ట‌ణాల క‌న్నా ప‌ల్లెల్లోనే ఎక్కువ చైత‌న్యం ఉంది. క‌రోనా వైర‌స్ త‌మ ప్రాంతాల‌కు రాకుండా గ్రామ‌స్తులు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. లాక్‌ డౌన్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో త‌మ గ్రామంలోకి ఎవ‌రూ రావ‌డానికి.. ఎవ‌రూ బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా స‌రిహ‌ద్దులు ఏర్పాటు చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే గ్రామంలో ఎవ‌రైనా కొత్తగా వ‌స్తే ఎలా గుర్తించుకోవ‌డం అనే విష‌య‌మై ఓ గ్రామం వినూత్న నిర్ణ‌యం తీసుకుంది. ఈ సంద‌ర్భంగా గ్రామ్తస్తులంతా గుండ్లు గీయించుకున్న సంఘ‌ట‌న రాజ‌స్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇటీవ‌ల తెలంగాణ‌లోని ఓ గ్రామంలో గ్రామ దేవ‌త‌కు మొక్కుగా గుండ్లు గీయించుకుంటే క‌రోనా రాద‌ని భావించి కొంద‌రు గుండ్లు గీయించుకున్న విష‌యం తెలిసిందే.

తాజాగా అలాంటి మాదిరి రాజ‌స్థాన్‌లోని అజ్మీర్ స‌మీపంలో ఉన్న గ్రామం మాయాపూర్‌ లో చోటుచేసుకుంది. మాయాపూర్‌ గ్రామ‌స్తులు క‌రోనా క‌ట్ట‌డి కోసం వినూత్నంగా ఆలోచించారు. బ‌య‌టి వ్య‌క్తులు గ్రామంలోకి వ‌స్తే తేలిక‌గా గుర్తించేందుకు గుండ్లు చేయించుకున్నారు. గ్రామ‌స్తులంద‌రూ గుండ్లు గీయించుకోవ‌డంతో ఆ గ్రామంలో గుండ్లే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇలా ఎందుకు చేశారంటే ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చిన వారిని గుర్తించేందుకంట‌. కొత్త‌వారు వ‌స్తే వారికి త‌ల‌పై వెంట్రుక‌లు ఉంటాయి. దీంతో వారిని సుల‌భంగా గుర్తించి వారిని వెంట‌నే తమ గ్రామం నుంచి వెళ్ల‌గొట్టేందుకు గుండ్లు ఐడియా వేసుకున్న‌ట్లు ఆ గ్రామ‌స్తులు తెలిపారు.

Tags:    

Similar News