కేంద్ర ఆయూష్ శాఖ సెక్రటరీ రాజేశ్ కొటేచా వివాదాస్పద వ్యాఖ్యల వల్ల ఇప్పుడు వివాదం రాజుకుంది. దక్షిణాది రాష్ట్రాల వారు.. ముఖ్యంగా తమిళలులు రాజేశ్ మాట్లాడిన మాటలకు కౌంటర్లు ఇస్తూ తెగ ఆడిపోసుకుంటున్నారు.
తాజాగా సెంటర్ ఫర్ డాక్టర్స్ అనేపేరుతో ఆన్ లైన్ లో ఆయూష్ కేంద్ర కార్యదర్శి రాజేశ్ కొటేచా వివిధ రాష్ట్రాల వైద్యులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ వైద్యుల నుద్దేశించి తాను ఇంగ్లీష్ లో మాట్లాడనని.. ‘హిందీ ’లోనే మాట్లాడుతానని.. ఇంగ్లీష్ అంతగా రాదని.. హిందీ రాని వారు వెళ్లిపోవచ్చని అవమానించాడు. దీనిపై తమిళనాడు వైద్యులు అవాక్కయ్యారు. తమకు హిందీ రాదనే ఇలా అవమానించాడని దుమారం చెలరేగింది.
నిజానికి కేంద్ర ఆయూష్ కార్యదర్శిగా ఎదిగిన రాజేశ్ కొటేచాకు ఇంగ్లీష్ రాకపోవడం ఆయన వైఫ్యలమేనే చెప్పవచ్చు. దేశ అత్యున్నత విభాగానికి కార్యదర్శి కనీసం ఇంగ్లీష్ నేర్చుకోకపోవడం దౌర్భాగ్యమే. తన వైఫల్యాన్ని చెప్పుకోకుండా దేశంలో హిందీ రాని వారు వెళ్లిపోమ్మనడమే ఇప్పుడు వివాదానికి కారణమైంది. దేశంలో ఉత్తరాదిన తప్పితే ఏ రాష్ట్రంలోనూ హిందీ లేదు. అది రాజ్యభాష కూడా కాదు.. ఈశాన్య, దక్షిణాదిన హిందీ మాట్లాడరు. అలాంటి ఈ అధికారి అహంకారం ఇప్పుడు కేంద్రాన్ని చిక్కుల్లో పడేసింది.
కేంద్రంలో ఈ హిందీ జాడ్యంపై మక్కల్ నీది మయ్యం అధ్యక్షులు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ నిప్పులు చెరిగారు. హిందీ ప్రభుత్వం కాదని.. భారత ప్రభుత్వం దేశంలో ఉందని గట్టిగా కౌంటరిచ్చారు. ప్రతీ ఒక్కరు అర్థం చేసుకునే భాషలో పనిచేయడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. కేంద్ర ఆయుష్ శాఖకు తమిళ వైద్యులు ప్రశ్నించకపోవడం మన వైద్యుల వినయానికి నిదర్శనమని కమల్ అన్నారు. ఇప్పటికే డీఎంకే ఎంపీ కనిమొళిని కూడా హిందీ రాకపోతే ‘భారతీయురాలివి కాదా’ అని ఎయిర్ పోర్టులో ప్రశ్నించారు. ఇప్పుడు మరో దుమారం చెలరేగింది.
హిందీ రాని వారిని అవమానించిన అధికారి రాజేష్ కొటేచాపై శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రజాప్రతినిధులు, అధికారులు డిమాండ్ చేస్తున్నారు. హిందీ తెలియకపోతే ఎన్ని రోజులు అవమానిస్తారని.. అది దేశ భాష కాదంటూ విమర్శిస్తున్నారు.