డీఎంకే ఫంక్ష‌న్లో త‌లైవా.. క‌మ‌ల్‌!

Update: 2017-08-10 16:40 GMT
త్వ‌ర‌లో రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌ని పెద్ద ఎత్తున అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్న త‌మిళ‌నాట‌లో ఆస‌క్తిక‌ర సీన్ ఒక‌టి చోటు చేసుకుంది. త‌మిళ‌నాడు ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన ద్ర‌విడ మున్నేట క‌ళ‌గం షార్ట్‌క‌ట్ లో చెప్పాలంటే డీఎంకేకు చెందిన ముర‌సోలి ప‌త్రిక‌కు సంబంధించిన ఫంక్ష‌న్ ఒక‌టి జ‌రిగింది. స‌ద‌రు ప‌త్రిక పెట్టి 75 సంవ‌త్స‌రాలు పూర్తి అయిన నేప‌థ్యంలో భారీ ఎత్తున ప్లాటిన‌మ్ జూబ్లీ వేడుక‌ల్ని నిర్వ‌హించారు.

చెన్నైలో నిర్వ‌హించిన ఈ వేడుక‌కు త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తో పాటు.. విశ్వ క‌థ‌నాయ‌కుడిగా సుప‌రిచితుడైన క‌మ‌ల్ హాస‌న్ ఈ వేడుక‌ల‌కు హాజ‌రుకావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. వీరితో పాలు ప్ర‌భు.. ప‌లువురు సినీ న‌టులు.. త‌మిళ రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

ఆరోగ్యం స‌రిగా లేని నేప‌థ్యంలో ఈ వేడుకల‌కు క‌రుణానిధి పాల్గొన‌లేదు. అయితే.. ఆయ‌న కుమారుడు డీఎంకే వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఈ కార్య‌క్ర‌మానికి అధ్యక్ష‌త వ‌హించారు.  ప‌ద్దెనిమిదేళ్ల వ‌య‌సులో ఉన్న‌ప్పుడు డీఎంకే అధినేత క‌రుణానిధి ముర‌సోలి ప‌త్రిక‌ను ప్రారంభించారు. స్వాతంత్రానికి పూర్వం అంటే 1942 ఆగ‌స్టు 10న ఈ ప‌త్రిక‌ను స్టార్ట్ చేశారు. అప్ప‌టి నుంచి ఏడు ద‌శాబ్దాలుగా నాన్ స్టాప్ గా ప్ర‌చురిత‌మైన ఈ ప‌త్రిక వేడుక‌ల‌కు హేమాహేమీలు హాజ‌రు కావ‌టం ఒక ఎత్తు అయితే.. రేపొద్దున డీఎంకేకు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్న ర‌జ‌నీ.. క‌మ‌ల్ లు ఇద్ద‌రూ ఆ పార్టీ వేడుక‌కు హాజ‌రు కావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News