ప్రస్తుతం తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్ ల రాజకీయ అరంగేట్రం రాజకీయ వేడిని పుట్టించిందని చెప్పవచ్చు. వీరిద్దరిలో కెల్లా కమల్ హాసన్ ....సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటారు. ట్విట్టర్ లో కమల్ తనదైన శైలిలో బీజేపీ - ఇతరులపై విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే, తలైవా మాత్రం అందుకు భిన్నంగా చాలా తక్కువగా ట్విట్టర్ ను ఉపయోగిస్తుంటారు. త్వరలో రజనీ కూడా తన పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయాలని యోచిస్తున్నారు. అందులో భాగంగానే రజనీకాంత్...అఫీషియల్ గా ఫేస్ బుక్ - ఇన్ స్టా గ్రాంలలో ఖాతాలు తెరిచారు.
2014లో కొచ్చాడయిన్ ప్రమోషన్ లో భాగంగా రజనీ ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేశారు. ఆ తర్వాత పెద్దగా దానిని ఉపయోగించిన దాఖలాలు కూడా లేవు. అయితే, తాజాగా రాజకీయ అరంగేట్రం తర్వాత రజనీ....సోషల్ మీడియాను కూడా వాడుకోవాలని భావిస్తున్నారట. అందులో భాగంగానే తాజాగా ఫేస్ బుక్ - ఇన్ స్టా గ్రామ్ ఖాతాలను ఓపెన్ చేశారు. ముఖ్యంగా యువకతో ఇంటరాక్ట్ అయ్యేందుకు రజనీ ఈ ఖాతాలను ఓపెన్ చేశారట.
వారితో పాటు ప్రజలందరికీ చేరువయ్యేందుకు సోషల్ మీడియాను వాడేయాలని తలైవా డిసైడ్ అయ్యారట. మరి, రజనీ సోషల్ మీడియాలో ఫాలోవర్లతో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తారో వేచి చూడాలి.