తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. త్వరలో తన పార్టీ విధివిధానాలను వెల్లడిస్తానని రజనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. రజనీ అరంగేట్రం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయనపై ప్రత్యర్థులు రాజకీయ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా - రజనీకి మరో ఇబ్బంది వచ్చి పడింది. రజనీ భార్య లతా రజనీకాంత్ డైరెక్టర్ గా ఉన్న `మీడియా వన్ గ్లోబల్ ఎంటర్ టైన్ మెంట్` సంస్థకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఆ కంపెనీ తీసుకున్న రుణాన్ని 3 నెలలలోపు చెల్లించాలని ఆదేశించింది. లేని పక్షంలో ఆ డబ్బును లత చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. బెంగుళూరుకు చెందిన ఓ యాడ్ బ్యూరోకు రుణపడిన రూ.6.20 కోట్లను 3 నెలలలోపు చెల్లించాలని సూచించింది.
రజనీకాంత్ హీరోగా ఆయన చిన్న కూతురు సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన `కొచ్చాడయాన్`చిత్రం ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసేందుకు బెంగుళూరుకు చెందిన ఓ యాడ్ బ్యూరో నుంచి `మీడియా వన్ గ్లోబల్ ఎంటర్ టైన్ మెంట్` ...రూ. 14.90 కోట్ల రుణాన్ని తీసుకుంది. అయితే, అందులో రూ.6.20 కోట్లను ఇంకా చెల్లించాల్సి ఉంది. దీంతో, ఆ యాడ్ బ్యూరో .... `మీడియా వన్ గ్లోబల్ ఎంటర్ టైన్ మెంట్` పై కోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ ను విచారణ జరిపిన కోర్టు....3 నెలలలోపు ఆ మొత్తం నగదును మీడియా వన్ సంస్థ చెల్లించాలని ఆదేశించింది. ఒక వేళ మీడియా వన్ చెల్లించలేని పక్షంలో డైరెక్టర్ హోదాలో ఉన్న లతా రజనీకాంత్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అందుకుగానూ లతా రజనీకాంత్ కూడా అంగీకరించినట్లు కోర్టు తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణ జులై 3న జరగనుంది.