ఉత్తరప్రదేశ్ లో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమీప బంధువు ఒకరు హత్యకు గురయ్యారు. అరవింద్ సింగ్ అనే ఆయన మంగళవారం రాత్రి తన భార్యను వారణాసి వద్ద ఎయిర్ పోర్టు లో దించి తిరిగి ఇంటికి వెళుతుండగా కొందరు దుండగులు బైక్ అడ్డంగా పెట్టారు. వారి మద్య స్వల్ప వాగ్వాదం జరిగింది. దుండగులు తమ వద్ద ఉన్న తుపాకీ తో అరవింద్ సింగ్ పై కాల్పులు జరిపారు.దాంతో ఆయన అక్కడికక్కడే చనిపోయినట్లు సమాచారం.ఆ తర్వాత దుండగులు పరారయ్యారు. ఇది పాత కక్షలతో జరిగిందా?లేక ఇంకే మైనా కారణాలు ఉన్నాయా అన్నది తెలియదు. ఘటన స్థలంలో .32 ఖాళీ షెల్ స్వాధీనం చేసుకున్నామని వారణాసి రూరల్ ఎస్పీ ఏకే పాండే చెప్పారు.
అయితే... మృతుడు అరవింద్ సింగ్ కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ కు అత్యంత దగ్గరి బంధువని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. అఖిలేశ్ పాలన ఉత్తరప్రదేశ్ ను దొంగల రాష్ట్రంగా, గ్యాంగ్ స్టర్ల రాష్ట్రంగా మార్చేసిందని మండిపడ్డారు. కాగా సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి బంధువునే హతమార్చడంతో యూపీ ప్రభుత్వం కూడా ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తోంది.