మనదేశాన్ని మరోసారి కవ్వించే ప్రయత్నం చైనా చేసింది. ఇంతకుముందు జులైలోనూ టిబెట్ ప్రాంతంలో పీఎల్ ఏ లైవ్ ఫైర్ డ్రిల్ నిర్వహించిన విషయం తెలిసిందే. సరిహద్దులోని డోక్లామ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇండియాపై మిలిటరీ చర్యకు తాము సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే చైనా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ బెదిరింపును నిజం చేసేందుకు అన్నట్లుగా తమ పశ్చిమ ప్రాంతంలో మరోసారి మిలిటరీ డ్రిల్ నిర్వహించింది. ఇది కచ్చితంగా ఇండియాను బెదిరించే చర్య అని చైనా సైనిక నిపుణులు చెప్పడం గమనార్హం.
చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెస్టర్న్ థియేటర్ కమాండ్ ఈ డ్రిల్ నిర్వహించింది. అయితే ఈ డ్రిల్ జరిగిన ప్రదేశం - సమయం మాత్రం బయటకు రాలేదు. ఇందులో పది పీఎల్ ఏ యూనిట్స్ పాల్గొన్నట్లు చైనా సెంట్రల్ టెలివిజన్ వెల్లడించింది. తాజా మిలిటరీ డ్రిల్స్ తో భారత్ ను మరింత ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చైనా చేస్తోంది. ఓవైపు డోక్లామ్ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ చెబుతుండగా.. మరోవైపు చైనా మాత్రం ఇలా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని అంటున్నారు.
మరోవైపు చైనాతో ఉద్రిక్తతంగా మారిన డోక్లామ్ సమస్య త్వరలోనే సమసిపోతుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇవాళ డోక్లామ్ అంశంపై మాట్లాడారు. డోక్లామ్ సమస్యపై చైనా సరైన పద్ధతిలో వ్యవహరిస్తుందని, రెండు దేశాల మధ్య శాంతి స్థాపన కూడా జరుగుతుందని రాజ్‌నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ వ్యవస్థలో ప్రమోషన్లు ఆలస్యం కాకుండా చూస్తామన్నారు. ఐటీబీపీ నియామకాలపై ప్రత్యేక రూల్స్ ఉన్నాయని, అయితే దీనిపై హోం కార్యదర్శితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. పారామిలిటరీ జవాన్లకు ఇంటి సమస్యలు ఉన్నాయని, వాళ్లకు నివాస సదుపాయాలు మెరుగుపరుస్తామన్నారు.