సూసైడ్ వైర‌ల్‌...ఆ ముగ్గురికీ షేర్ చేయాల‌ట‌!

Update: 2017-11-14 10:24 GMT
కౌన్సెలింగ్ పేరుతో పోలీసులు వేధించడంతో మనస్తాపానికి గురైన ఓ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. అంత‌కు ముందు త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని సెల్ఫీ వీడియోలో వివ‌రించాడు. పోలీసుల తీరును ప్ర‌శ్నిస్తూ తీసుకున్న ఆ సెల్ఫీ వీడియో ప్ర‌స్తుతం క‌ల‌క‌లం రేపుతోంది. అంతేకాకుండా త‌న వీడియోను కేసీఆర్‌ - చంద్ర‌బాబు - ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి చేరేవ‌ర‌కూ షేర్ చేయాల‌ని బాధితుడు కోర‌డంతో నెటిజ‌న్లు షేర్ చేస్తుండ‌టంతో విష‌యం వెలుగుచూసింది.

ఈ విషాద ఘ‌ట‌న నాగర్‌ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో జ‌రిగింది. ఎస్ ఐ తనను కొట్టాడన్న అవమానభారంతో రాజు అనే యువ‌కుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్‌ కు ముందు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ.. పోలీసుల తీరును ప్రశ్నిస్తూ బాధితుడు తీసుకున్న సెల్ఫీ వీడియో కలకలం రేపింది. 'న‌న్ను భార్య వాళ్ల గ్రామస్తులు కొట్టారు. ఆపై బట్టలిప్పి చచ్చేలా పోలీసులు కొట్టారు. నా మృతికి ఎస్ ఐ సైదాబాబు కారణం. కేసీఆర్ - చంద్రబాబు - ప్రధాని నరేంద్ర మోదీకి చేరేంత వరకూ ఈ వీడియోను షేర్ చేయాలంటూ' రాజు సెల్ఫీ వీడియోలో వివ‌రించాడు.

వెల్దండ మండల పరిధిలోని నారాయణపూర్ తాండాకు చెందిన పాత్లవత్ రాజు (25)కు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టిఇప్పలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కొరింతకుంట తండాకు చెందిన అంజలితో ఐదేళ్ల కిందట వివాహమైంది. వీరికి గతంలో ఓ కుమారుడు ఉండగా - వారం కిందట అంజలి ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పటినుంచీ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 12న తలకొండపల్లి పోలీస్‌ స్టేషన్లో అంజలి కుటుంబసభ్యులు ఫిర్యాదుచేయగా.. భర్త రాజును పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయితే కౌన్సెలింగ్ పేరుతో పోలీసులు వేధించడంతో మనస్థాపానికి గురైన రాజు ఇంటికి వచ్చి పురుగుల మందు తాగాడు. ఇరుగుపొరుగు రాజు పరిస్థితిని గమనించి హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రికి త‌ర‌లించ‌గా... చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు.

Full View
Tags:    

Similar News