ఢిల్లీ అల్లర్ల అంశం పై దద్దరిల్లిన పార్లమెంట్..ఉభయ సభలు వాయిదా

Update: 2020-03-03 08:30 GMT
పార్లమెంట్ లో నిన్నటి సీన్ మళ్లీ నేడు కూడా రిపీట్ అయ్యింది. మంగళవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే ..మరోసారి ఉభయసభలు వాయిదా పడ్డాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా 11 గంటలకు ప్రారంభమైన పార్లమెంట్‌ ను విపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఢిల్లీ అలర్లకు సంబంధించి చర్చ చేపట్టాలంటూ విపక్ష పార్టీ సభ్యులు డిమాండ్ చేస్తూ, లోక్‌ సభ స్పీకర్ వెల్‌ లోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీనితో స్పీకర్ ముందు వెళ్లి తమ స్థానాల్లో కూర్చోవాలంటూ చెప్పారు. కానీ, ఎంతచెప్పినా సభ్యులు వారికీ కేటాయించిన స్థానాలలో కూర్చోకపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ , సభలో క్రమ శిక్షణ తప్పితే సస్పెండ్ చేసేందుకు వెనకాడబోనని వార్నింగ్ ఇచ్చారు.

అయినాకూడా స్పీకర్ మాటలని విపక్ష పార్టీ సభ్యులు పట్టించుకోలేదు. ఏదేమైనా సభలో ముందు ఢిల్లీ అల్లర్లపై చర్చ జరగాల్సిందేనంటూ పట్టుబట్టారు. దీనితో ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ ఓం బిర్లా భ్యులు తమ సీట్లలో కూర్చోకుంటే సమావేశాలనే వాయిదా వేస్తానంటూ గట్టిగా హెచ్చరించారు. ఆ తరువాత సభని కాసేపు వాయిదా వేశారు. ఇక రాజ్యసభలోను ఇదే తీరు కనిపించింది. సమావేశాలు ప్రారంభం కాగానే ..ఢిల్లీ అంశంతో రాజ్యసభ దద్దరిల్లడం తో చైర్మన్ వెంకయ్య నాయుడు ..మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. ఉదయం సభ ప్రారంభం కాగానే అధికార విపక్ష పార్టీల సభ్యుల మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. సభలో ప్రతి ఒక సభ్యుడు క్రమశిక్షణతో వ్యవహరించాలని చైర్మన్ వెంకయ్యనాయుడు పదేపదే చెప్తున్నప్పటికీ, విపక్ష పార్టీల సభ్యులు వినక పోవడంతో సభను మధ్యాహ్నం 2 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Tags:    

Similar News