ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అలర్ట్ అయిపోతున్నారు. అధికారం మీద ఆశ అందరికీ ఉంటుంది గానీ.. అందులో పరువుపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. పైగా అసలే ఇలాంటి లోపాయికారీ యవ్వారాలు నడపించినందుకు ఇప్పుడే ఇరుక్కుని ఉన్న కేసు ఎప్పుడు పుట్టి ముంచుతుందో ఏమో తెలియక.. లోలోపల సతమతం అయిపోతున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో తాజాగా అవకాశం కొంత ఊరిస్తున్నప్పటికీ.. అటు పరువు, ఇటు కేసుల భయంతో.. మిన్నకుండిపోవడానికే చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుగుదేశం పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో.. తెలుగుదేశానికి రెండు సీట్లు దక్కే అవకాశం ఉంది. నిజానికి మూడో సీటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కాలి. కానీ చంద్రబాబు దానికి కూడా ఆశపడుతున్నట్లుగా కొన్ని పుకార్లు వచ్చాయి. పార్టీకి గరిష్టంగా లబ్ధి చేకూర్చగల ‘బాగా’ ఉపయోగపడగల వ్యక్తులను ఎంచుకుని.. వారికి రాజ్యసభ పదవులను కట్టబెట్టే అలవాటు ఉన్న చంద్రబాబునాయుడు.. ఈసారి మూడో ఎంపీ పదవిని కూడా మానిప్యులేట్ చేయగలిగితే.. మరింత ప్రయోజనం ఉంటుందని తొలుత అనుకున్నారు.
అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర రెడ్డిని రంగంలోకి దించడంతో చంద్రబాబు దాదాపుగా వెనక్కు తగ్గినట్టే. ఎందుకంటే.. వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఇప్పటికే ప్రచారంలో చాలా ముందంజలో ఉన్నారు. ఇప్పటికే ఆయన జిల్లా టూర్లు చేసేసి.. పార్టీకి చెదింన అందరు ఎమ్మెల్యేలతోనూ ఒక విడత ప్రచారం నిర్వహించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం నిలబెట్టే అభ్యర్థికి ఓటు వేస్తారనుకోవడం భ్రమ. ఆ నేపథ్యంలో.. మూడో అభ్యర్థికి దాదాపు ఆరు ఓట్ల వరకు తక్కువ పడుతుంది. అంత మందిని వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి అక్రమంగా ఫిరాయింపజేయడం అనేది సాధ్యం కాని పని. పైగా.., మూడో అభ్యర్థిని రంగంలోకి దించడం అంటేనే.. తాము బేరసారాలకు పాల్పడుతున్నాం అనే అర్థం వచ్చేస్తుంది. అభ్యర్థి గెలిచేది లేనిది తర్వాతి సంగతి.. ముందు నిందలు మోయాల్సి వస్తుంది.
ఇదే తరహా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ విఫల ప్రయత్నం చేసి తెలంగాణ లో కేసుల్లో ఇరుక్కున వైనం కూడా.. చంద్రబాబు వెనక్కు తగ్గడానికి ఒక కీలక కారణం అని విశ్లేషకులు భావిస్తున్నారు.