ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల కోలహలం మొదలైంది. రెండు రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా జూన్ నెలలో 57 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 4 స్థానాలు - తెలంగాణలో రెండు స్థానాల భర్తీకి ఎన్నిక నిర్వహించనున్నారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలుకానుంది. మే 31 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. జూన్ 1న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 3న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు. 11న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగును. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. 13న ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.
రెండు రాష్ట్రాల్లోనూ ఇప్పటికీ ఏ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. తెలంగాణలో రెండు సీట్లు అధికార పార్టీకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 4 సీట్లకు గాను మూడు తెలుగుదేశం పార్టీకి దక్కడం ఖాయం. అయితే నాలుగో సీటుకు కూడా ఆ పార్టీ బరిలో దిగే అవకాశం కనిపిస్తున్నది. ఇక ప్రతిపక్ష వైసీపీ తమ తరఫున అభ్యర్థిని బరిలో దించేందుకు ఇప్పటికే సన్నద్ధం అయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నిక రంజుగా సాగే అవకాశం ఉందని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.