దేశంలో మత అసహనం పెరిగిపోతుందని.. దేశంలో ఉండాలంటే భయం కలుగుతుందని.. దేశం విడిచి వెళ్లిపోదామంటూ తన భార్య తనతో మాట్లాడిందంటూ బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. తన భార్య కిరణ్ రావ్ తనతో చెప్పిన మాటల్ని బయటకు తెచ్చి.. చర్చకు పెట్టటం ద్వారా దేశంలో మత అసహనం మీద మరో కొత్తతరహా చర్చ మొదలైంది.
అమీర్‌ఖాన్ వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. అదే సమయంలో అమీర్‌కు మద్దుతగా గళం విప్పుతున్న వాళ్లూ ఉన్నారు. అయితే.. అమీర్ వ్యాఖ్యను తప్పు పడుతున్న వారు సంధిస్తున్న సందేహాలు కొత్త చర్చకు తావిచ్చేలా ఉన్నాయి. తన వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాలో నిత్యం నానే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. అమీర్ వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించారు.తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.
దేశంలో అసహనం ఎక్కడుందో తనకు కనిపించటం లేదని.. తనకు అలాంటిదేమీ అర్థం కావటం లేదన్న వర్మ.. హిందూ దేశంగా పేరున్న భారత్ లో షారూక్ ఖాన్.. సల్మాన్ ఖాన్.. అమీర్ ఖాన్ లాంటి ముగ్గురు ముస్లిం సూపర్ స్టార్లుగా వెలుగొందుతున్నారు. మరి.. అసహనం ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు? అని ప్రశ్నించారు.
ఒక హిందూ దేశంగా చెబుతున్న దేశంలో ముగ్గురు ముస్లిం నటులు సూపర్ స్టార్లుగా కావటమంటే మెజార్టీ ప్రజలు అసహనంతో లేరని నిరూపితమవుతుందని వర్మ తేల్చేశారు. అసహనం గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో.. వారంతా అదే దేశంలో సెలబ్రిటీలుగా చలామణి అవుతున్నారని గుర్తు చేసిన వర్మ.. కొన్ని ఘటనల్ని చూపించి దేశం మొత్తాన్ని దాన్ని ఆపాదించటం సరికాదని తేల్చారు. అయినా.. భార్యభర్తల మధ్య జరిగే సవాలచ్చ సంభాషణల్ని బయటకు చర్చకు పెట్టి.. రచ్చ చేయటం అమీర్‌ఖాన్ లాంటి సెలబ్రిటీలకు ఏమాత్రం సబబు అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది.