జనాల ప్రాణాలు ఏమైనా తేరగా ఉంటాయా? ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి. నేతగా అనిపించుకున్నంతనే తానేమో ఆకాశంలో నుంచి ఊడిపడినట్లు.. మిగిలినోళ్లంతా అందుకు భిన్నమన్నట్లుగా మాటలు వినిపిస్తుంటాయి. నాట్ నాట్ సెంచరీ నుంచి బలిదానాలకు ప్రజలు సిద్ధంగా ఉండాలనే మాట విని విని బోర్ కొట్టేయటమే కాదు.. చిరాకు తెప్పించేస్తోంది కూడా. అందుకే ఈసారి రోటీన్ కు భిన్నంగా నేతలే.. క్యూ కట్టి బలిదానాలకు సిద్ధమైపోతే బాగుంటుంది కదా. వివాదాలు కూడా ఇట్టే సమిసిపోతాయి.
దేశాన్ని ఒక కుదుపు కుదిపేసిన రామజన్మభూమి ఇష్యూ మీద దారుణమైన వ్యాఖ్య ఒకటి చేశారు బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ మాట్లాడుతూ.. రామజన్మభూమి మరోసారి హిందూ కమ్యూనిటీ త్యాగాలు కోరుకుంటోందని.. హిందువులు ఇందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ములాయం సింగ్ హయాంలో 1992 డిసెంబరు 6న జరిగిన కాల్పుల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని.. మరోసారిఎదురొడ్డి నిలవాల్సిన సమయం ఆసన్నమైందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వినయ్ కతియార్ చేసిన దరిద్రపుగొట్టు వ్యాఖ్యలు విన్నంతనే ప్రజలు రెచ్చిపోకుండా.. రివర్స్ గేర్ లో బీజేపీ నేతల్నే ఆత్మ బలిదానాలకు సిద్ధం కావాలని కోరితే సరి.
గతంలో హిందూ కరసేవకులు ఏ రీతిలో అయితే ప్రాణత్యాగం చేశారో.. అదే తరహాలో కమలనాథులంతా క్యూ కట్టి ప్రాణ త్యాగం చేసుకుంటే.. రామజన్మభూమి ఇష్యూ ఏదో ఒక కొలిక్కి రావటం ఖాయం. అలా కాకుండా సామాన్యులు రక్తం చిందించటం కంటే కమలనాథులు తమ రక్తాన్ని ప్రజల కోసం త్యాగం చేస్తే బాగుంటుందేమో? ఆవేశంతో రెచ్చగొట్టే మాటలకు చెక్ చెప్పి.. నేరుగా గోదాలోకి దిగితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.