రామోజీరావు మరీ.. అంత సింఫులా..?

Update: 2015-10-22 04:12 GMT
కొంతమంది గురించి ఎంత చెప్పినా ఆసక్తిగానే ఉంటుంది. ఎందుకంటే వారి వ్యవహారశైలి నలుగురికి భిన్నంగా ఉంటుంది. రామోజీ గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు గురించే చూడండి. ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని చూసినా.. ఆయనకున్న పలుకుబడిని చూసినా ఎవరికి అందనంత ఎత్తులో ఉంటారు.

అలాంటి వ్యక్తి ఎంత సింఫుల్ గా ఉంటారో చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. ఇంత సింఫుల్ గా ఉండే ఆయన్ను కలిసే ప్రయత్నం చేస్తే చుక్కలు కనిపిస్తాయి. ఆయన్ను కలవటం అంత తేలికైన విషయం కాదు. దానికి చాలానే పరిమితులు ఉంటాయి. అందరికి దూరంగా ఉంటూనే దగ్గరగా ఉండే మేజిక్ రామోజీ సొంతం.

అందరితోనూ పరిమితమైన పరిచయం ఉన్నట్లుగా కనిపిస్తూనే అపరిమితమైన దగ్గరితనాన్ని మొయింటైన్ చేయటం ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే వ్యవహారం. ఆయనకున్న భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని చూసిన వారు కానీ.. ఫిలింసిటీలో ఆయన ‘‘రేంజ్’’ చూసిన వారు కానీ ఆయన చాలా విలాసవంతమైన వ్యక్తిగా భావిస్తారు. వాస్తవంలో ఆయన అందుకు చాలా భిన్నమైన వ్యక్తి.

చాలా సింఫుల్ గా ఉంటారు. అందరితోనూ మాట్లాడేస్తారు. ఒక ముఖ్యమంత్రితో ఎంత స్నేహంగా ఉండగలరో.. తన దగ్గర పని చేసే చిన్నపాటి ఉద్యోగితోనూ అంతే స్నేహంగా.. మానవత్వంతో మెలుగుతారు. అయితే..రామోజీకి సంబంధించి ప్రతి విషయంలోనూ.. ప్రస్తావించే ప్రతి అంశం పైనా స్టార్ గుర్తు ఉంటుందని మర్చిపోకూడదు. స్టార్ గుర్తు అంటే.. ‘‘షరతులు వర్తిస్తాయి’’ అన్నది.

అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యేందుకు విజయవాడకు రామోజీ బుధవారమే బయలుదేరారు. ఆయనలాంటి వ్యక్తి ప్రత్యేక హెలికాఫ్టర్ లోనో.. ప్రత్యేక చాఫ్టర్ ఫ్లైట్ లోనో వెళతారని అందరూ భావిస్తారు. కానీ.. అందుకు భిన్నంగా.. కొందరు ప్రముఖులతో కలిసి ప్రయాణించటం చూస్తే.. రామోజీ ఇంత సింఫులా అనిపించక మానదు. ఆయనకున్న సమయం చాలా విలువైనది. ప్రతి క్షణం ఆయన బిజీబిజీగా ఉంటారు. అలాంటి ఆయన అవసరానికి అనుగుణంగా హోదా కంటే కూడా అందరిలో తాను ఒకడి వాడిగా కనిపించటానికే ఇష్టపడతారు. అదే సమయంలో.. అందరిలోనూ ఆయన ప్రత్యేకంగా ఉంటారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో.
Tags:    

Similar News