అమరావతి శంకుస్థాపనకు సంబంధించి పిలుపుల కార్యక్రమం దాదాపు ముగియటం.. కార్యక్రమం జరగటానికి ఇంకా రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉండటం తెలిసిందే. సోమవారం ఉదయం రామోజీ ఫిలిం సిటీకి వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావును స్వయంగా ఆహ్వానించి.. సకుటుంబ సమేతంగా అమరావతికి రావాలని ఆహ్వానించటం తెలిసిందే.
రామోజీని రావును చంద్రబాబు స్వయంగా ఆహ్వానించిన నేపథ్యంలో ఆయన్ను ఎక్కడ కూర్చోబెడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. శంకుస్థాపన కార్యక్రమానికి పెద్ద ఎత్తున వీవీఐపీలు వస్తుంటే.. ఒక్క రామోజీ గురించే చర్చ ఎందుకన్న డౌట్ వచ్చే వారూ ఉన్నారు. కానీ.. ఎవరికి లేని స్పెషాలిటీ రామోజీ సొంతం.
అదెలానంటే.. సార్వత్రిక ఎన్నికల అనంతరం విజయఢంకా మోగించి కేంద్రంలో ఎన్డీయే అధికారాన్ని సొంతం చేసుకోవటం తెలిసిందే. ప్రధాని పదవిని మోడీ చేపట్టే ప్రమాణస్వీకారమహోత్సవానికి.. దేశంలో ప్రముఖ నేతలకు.. పారిశ్రామికవేత్తలకు.. ఎందరో వీవీఐపీలకు ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మొదలు.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. అంబానీలు లాంటి ప్రముఖులు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి రామోజీరావును ఆహ్వానించారు.
కానీ.. కార్యక్రమం మొదలయ్యాక కానీ రామోజీరావు రేంజ్ ఏమిటో.. టీవీల్లో లైవ్ చూస్తున్న ప్రతిఒక్కరికి కనిపించి ఒకలాంటి విస్మయానికి గురి అయ్యే పరిస్థితి. ఎందుకంటే.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు.. కేసీఆర్ లు ఇద్దరే కాదు.. ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ సైతం రెండో వరుసలో కూర్చుంటే.. వీరందరికి భిన్నంగా రామోజీరావుకు మాత్రం మొదటి వరుసలో స్థానం దక్కింది. జాతీయ స్థాయిలో చూస్తే రామోజీరావు ఎంత పవర్ ఫుల్ అన్న విషయం దీంతో మరోసారి స్పష్టమైంది.
అలాంటి రామోజీరావు అమరావతి శంకుస్థాపనకు దాదాపుగా వెళ్లటం ఖాయమనే చెబుతున్నారు. ఇంటికి స్వయంగా వచ్చిన మరీ ముఖ్యమంత్రి ఆహ్వానించిన నేపథ్యంలో ఆయన వెళ్లటం ఖాయమని చెబుతున్నారు. మరి.. అలాంటప్పుడు ఆయన్ను ఎక్కడ కూర్చోబెడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉన్నతాధికారుల మాటల్ని చూస్తే.. ప్రధాన వేదికకు ఇరు పక్కలా రెండు వేదికలు నిర్మిస్తున్న వాటిల్లో ఏదో ఒక దాన్లో.. మొదటి వరుసలో రామోజీ కుర్చీ ఉంటుందని చెబుతున్నారు.