ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు గౌరవ డాక్టరేట్ లభించింది. ఒడిస్సా రాష్ర్టం కటక్ లోని శ్రీ శ్రీ విశ్వవిద్యాలయం ఆయనకు ఈ పురస్కారం ప్రకటించింది. రామోజీతో పాటు నేపాల్ కు చెందిన వినోద్ చౌదరి, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త మహేష్ గుప్తాలకు మంగళవారం ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.
కటక్‌లో శ్రీశ్రీ విశ్వవిద్యాలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త పండిట్ రవిశంకర్ ఏర్పాటు చేశారు. ఈ అవార్డు స్వీకరించేందుకు కటక్ వెళ్లిన రామోజీ సోమవారం కటక్ లో ఉన్న ప్రసిద్ధ పూరి జగన్నాథస్వామి ఆలయాన్ని సందర్శించుకుని పూజలు చేశారు. నుదుట తిలకం, మెడలో కండువాతో ఆయన పూజలో పాల్గొన్నారు. అనంతరం శ్రీ శ్రీ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరిగిన సత్సంగ్ సభలో కూడా రామోజీ పాల్గొన్నారు.
రామోజీరావు రామోజీ ఫిలింసిటీ లో రూ.100 కోట్లతో ఓం సిటీ అనే ఆధ్యాత్మిక క్షేత్రాన్ని నిర్మించనున్నారు. ఇది పూర్తయితే రామోజీ ఫిలింసిటీకి మరో అరుదైన గుర్తింపు లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ స్థాపించిన విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ దక్కడం విశేషం.